కాంగ్రెస్‌కు భారీ షాక్...అధికార పార్టీలో చేరిన కార్యనిర్వహక అధ్యక్షుడు

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 3:12 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో చత్తీస్ ఘడ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో అధికార బిజెపి పార్టీ మరోసారి అధికారం చేజిక్కించుకోడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ఎన్నికలకు ముందే నైతికంగా బలహీనపర్చేందుకు ఈ పార్టీలోని ముఖ్య నాయకులకు బిజెపి ఎర వేసింది.

ఇందులో భాగంగా  చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు రాం దయాల్ ఉకెని బిజెపిలో చేర్చుకున్నారు.  బిలాస్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో రాందయాల్ బిజెపి తీర్థం పుచ్చుకున్నాడు. అతడికి కాషాయ కండువా కప్పి అమిత్ షా పార్టీలోకి చేర్చుకున్నాడు. 

ఈ పరిణామం ఎన్నికలకు సిద్దమవుతున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార బిజెపి పార్టీ ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బతీయడానికే సీనియర్ నాయకులకు ఎర వేస్తున్నట్లు వారు అభాప్రాయపడుతున్నారు. 

రాందయాల్ బిజెపిలో చేరడాన్ని చత్తీస్ ఘడ్ పిసిసి అధ్యక్షుడు భూపేష్ భగాలే తప్పుబట్టాడు. ఎన్నికల తరుణంలో రాజకీయంగా దెబ్బతీసేందుకే బిజెపి ఈ చేరికలను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. 

click me!