కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిక: రోగి పొట్టలో నుండి 39 నాణెలు, 27 ఆయస్కాంతాలు వెలికితీత

By narsimha lode  |  First Published Feb 27, 2024, 12:12 PM IST


భోజనం తీసుకోకుండా  కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న  ఓ వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు  షాక్ కు గురయ్యారు.


న్యూఢిల్లీ: ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రి వైద్యులు ఓ వ్యక్తి  శరీరం నుండి  38 నాణెలు, 37 ఆయస్కాంతాలను శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. స్కిజోఫ్రెనియాతో  బాధపడుతున్న రోగి శరీరం నుండి  నాణెలు,  అయస్కాంతాలను బయటకు తీశారు.సీనియర్ కన్సల్టెంట్  డాక్టర్ తరుణ్ మిట్టల్ నేతృత్వంలో డాక్టర్ల బృందం శస్త్రచికిత్స చేసి  రోగి శరీరం నుండి  నాణెలను  బయటకు తీశారు.

also read:రేషన్ కార్డుంటేనే రూ. 500లకు గ్యాస్ సిలిండర్: నిబంధనలు ఇవీ..

Latest Videos

ఢిల్లీలో  నివాసం ఉంటున్న యువకుడు  పదే పదే వాంతులు, కడుపునొప్పితో  బాధపడుతున్న  యువకుడు ఆసుపత్రిలో చేరారు.భోజనానికి బదులుగా  మూడు వారాలుగా నాణెలు, అయస్కాంతాలను రోగి మింగినట్టుగా  బంధువులు వెల్లడించారు. రోగి పొట్టలో  నాణెలు, ఆయస్కాంతాలు ఉన్నట్టుగా స్కానింగ్ లో వైద్యులు గుర్తించారు. 

also read:తెలంగాణ నుండి పోటీకి సోనియా నిరాకరణ, తెరపైకి రాహుల్: ఆ మూడు స్థానాలపై ఫోకస్

డాక్టర్ తరుణ్ మిట్టల్ , అతని బృందం  రోగికి శస్త్రచికిత్స నిర్వహించింది. రెండు గంటల పాటు వైద్యుల బృందం  ఆపరేషన్ నిర్వహించి  రోగి పొట్టలో ఉన్న  నాణెలు,  ఆయస్కాంతాలను  తొలగించారు.  రూ.1,2,5 నాణెలతో పాటు  గోళం, నక్షత్రం, బుల్లెట్, త్రిభుజం వంటి ఆయస్కాంతాలను  రోగి పొట్ట నుండి బయటకు తీశారు.  ఈ వస్తువుల కారణంగా  రోగి ప్రేగులు  కోతకు గురైనట్టుగా వైద్యులు గుర్తించారు.  రోగి శరీరంలో కొన్ని విదేశీ వస్తువులను కనుగొన్నట్టుగా వైద్యులు చెప్పారు.  ఈ రకమైన విదేశీ వస్తువులను తీసుకోవడం ద్వారా రోగులకు ప్రాణహాని ఉంటుందని డాక్టర్ మిట్టల్ తెలిపినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

also read:గగన్ యాన్‌: అంతరిక్షయాత్రలో పాల్గొనే భారత వ్యోమగాములు వీరే

26 ఏళ్ల రోగికి శస్త్రచికిత్స తర్వాత  వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. వారం తర్వాత  ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.  రోగి  ఆరోగ్యం బాగానే ఉందని  సమాచారం.  డాక్టర్  ఆశిష్ డే, డాక్టర్ అన్మోల్ అహుజా, డాక్టర్ విక్రం సింగ్, డాక్టర్ తనుశ్రీ, డాక్టర్ కార్తీక్ లతో సహా వైద్య బృందం  రోగికి శస్త్రచికిత్స చేసింది. ఈ ఆపరేషన్  సక్సెస్ కావడంతో  రోగి బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

click me!