లోక్ సభ బరిలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్...!

By SumaBala Bukka  |  First Published Feb 27, 2024, 11:43 AM IST

సినిమాల్లోకి రాకముందు అక్షయ్ కుమార్ చాలా సంవత్సరాలు చాందిని చౌక్ ప్రాంతంలోనే ఉన్నారు. ఆయన గెలుపుకు ఈ స్థానికత బాగా పనికి వస్చుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  


ఢిల్లీ : బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని సమాచారం. ఢిల్లీలో బిజెపి గతంలో ఏడు లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా వాటిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే ఆ ఏడు స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సిట్టింగుల స్థానంలో కొంతమందిని కొత్తవారిని మార్చాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ని బిజెపి ఢిల్లీ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దించాలని చూస్తున్నట్లుగా సమాచారం.

ఇప్పటి వరకు దీనిమీద ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ చాందిని చౌక్ స్థానం నుంచి అక్షయ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తా కథనాల ప్రకారం ఇప్పటికే బీజేపీ పార్టీ నేతలు అక్షయ్ కుమార్ ను ఒకసారి కలిశారట. ఇక చాందిని చౌక్ నుంచే ఎందుకు అంటే.. సినిమాల్లోకి రాకముందు చాలా సంవత్సరాలు అక్షయ్ కుమార్ చాందిని చౌక్ ప్రాంతంలోనే ఉన్నారు.

Latest Videos

Gulf Ticket : 667 మంది ఇండియన్స్ కి జాక్ పాట్

స్థానికతను దృష్టిలో ఉంచుకొని అక్షయ్ కుమార్ ను బరిలోకి దించాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఢిల్లీలో 2014 2019 ఎన్నికల్లో బిజెపి అన్ని స్థానాలను క్లీన్ స్వీట్ చేసింది.  ఇక చాందిని చౌక్ నుంచి 2014,  2019లో కేంద్రమంత్రి, బిజెపి నేత డాక్టర్ హర్షవర్ధన్ విజయం సాధించారు. అంతకుముందు 2009, 2004లో మాజీ కాంగ్రెస్ నేత, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ గెలిచారు. ఈ 2024 సార్వత్రిక ఎన్నికలు బిజెపి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మూడోసారి మోడీ ప్రధాని కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ ల మధ్య  పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా ఢిల్లీలోని మొత్తం 7 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ మూడు స్థానాల్లో, ఆప్ నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే బిజెపి అభ్యర్థి ఎంపికలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి వ్యవహరిస్తుందని అంటున్నారు. 
 

click me!