Arvind Kejriwal: దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుతున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఈ వేరియంట్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఢిల్లీలో పాజిటివ్ వచ్చిన అన్ని కేసుల శాంపిళ్లను జీనోమ్ సిక్వెన్సింగ్ కు పంపుతామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అలాగే, బూస్టర్ డోసులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
Arvind Kejriwal: దేశంలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళనలు అధికమవుతున్నాయి. ఈ వేరియంట్ ఇతర దేశాల్లో వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలోనే ఈ కేసులు భారత్ లోనూ నిత్యం వెలుగుచూస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఢిల్లీలో పాజిటివ్ వచ్చే కరోనా వైరస్ కేసులన్నింటికీ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. ఒమిక్రాన్ ప్రభావం మైల్డ్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్‌లో చేరుతున్నవారి సంఖ్య, మరణాలు తక్కువగానే ఉందని కేజ్రీవాల్ వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పెరుగుతున్నది కాబట్టి కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన బూస్టర్ డోసులు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు.
Also Read: elections 2022: మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్ లా ఉంది: బీజేపీ
undefined
దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయ. ఢిల్లీలో ఇప్పటివరకు 22కు పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు గుర్తించారు. స్థానికంగా ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మీడియాతో మాట్లాడారు. కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌ను ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు. ఓమిక్రాన్ ముప్పు దృష్ట్యా భయపడాల్సిన అవసరం లేదనీ, కొత్త కోవిడ్ వేరియంట్ వ్యాప్తి చెందితే ఆస్పత్రుల్లో దానికి తగిన ఏర్పాట్లు చేశామని కేజ్రీవాల్ తెలిపారు. ఒమిక్రాన్ పై ప్రజల భయాందోళనల గురించి మాట్లాడుతూ.. “Omicron కోవిడ్-19కు చెందిన తేలికపాటి రూపాంతరం అని నిపుణులు అంటున్నారు. Omicron కారణంగా ఆస్పత్రిలో చేరే వారితో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది"అని అన్నారు. కొత్త వేరియంట్ కేసులు పెరిగితే.. ఆస్పత్రుల్లో చేరే అవకాశం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా తాము హోం ఐసోలేషన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసులు ఢిల్లీలో పెరుగుతున్నాయి. ఒకవైపు ఒమిక్రాన్ భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి కరోనా వైరస్ పాజిటివ్ గా వచ్చిన అన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని కేజ్రీవాల్ వెల్లడించారు.
Also Read: Pawan Kalyan: కనీసం ప్లకార్డులైనా పట్టుకోండి: వైకాపాకు పవన్ చురకలు
అలాగే, ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ప్రభుత్వం సెరో సర్వే నిర్వహించిందని తెలిపిన కేజ్రీవాల్.. రాష్ట్ర జనాభాలో 96 శాతం మంది కరోనా వైరస్ యాంటీబాడీలను కలిగి ఉన్నారని వెల్లడించారు. వారిలో చాలా మందికి టీకాలు సైతం వేశామని తెలిపారు. కాబట్టి ఢిల్లీలో మరో అంటువ్యాధి విజృంభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, ఢిల్లీలో కొత్తగా 107 COVID-19 కేసులు నమోదయ్యాయి. జూన్ 27 నుండి రోజువారీ అత్యధిక పెరుగుదల ఇదే. అలాగే, కరోనా సానుకూలత రేటు 0.17 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. అలాగే ఒకరు కరోనా వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు 14,42,197కు పెరిగాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు మొత్తం 25,101 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలావుండగా, దేశంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 153కి పెరిగింది. ఆదివారం మహారాష్ట్రలో ఆరు, గుజరాత్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 14, తెలంగాణ 20, గుజరాత్ 11, కేరళ 11, ఆంధ్రప్రదేశ్, ఛండీగఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్కటి చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Also Read: Omicron variant: కలవరపెడుతున్న ఒమిక్రాన్.. కొత్తగా మరో 8 కేసులు.. మొత్తం 153