
ఢిల్లీ : దేశంలోని ఎన్నికల ప్రక్రియలో కీలక సంస్కరణలు చేపట్టేలా తీసుకొచ్చిన Election Laws Amendment Billను కేంద్ర ప్రభుత్వం నేడు Lok Sabhaలో ప్రవేశపెట్టింది. బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా voter IDని , aadhar cardతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు సభలో ప్రవేశపెట్టారు.
అయితే ఈ బిల్లును కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఇది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆరోపించాయి. అంతేగాక, సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు. అయినప్పటికీ దీన్ని ప్రవేశ పెట్టడానికి స్పీకర్ అంగీకరించడంతో కేంద్రమంత్రి బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. అయితే, ఈ బిల్లుతో పాటు లఖింపూర్ ఘటన, ఇతర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ బిల్లుపై చర్చ మొదలు పెట్టకుండానే లోక్ సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది.
సవరణ బిల్లు ఏంటి ..
ఓటర్ల జాబితాను బలోపేతం చేయడం, ఓటింగ్ ప్రక్రియను మరింత మెరుగుపరచడం, ఈసీకి మరిన్ని అధికారాలు కల్పించడంతోపాటు బోగస్ ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పలు ప్రతిపాదనలున్న ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసింది. పాన్-ఆధార్ లింక్ చేసినట్లుగానే, ఓటర్ ఐడి కార్డు లేదా ఎలక్టోరల్ కార్డుతో ఆధార్ నెంబర్ను అనుసంధానం చేయనున్నారు.
కాకపోతే వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛందంగా ప్రజలే అనుసంధానించికునేలా ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు సమాచారం. అలాగే, కొత్త ఓటర్ల నమోదుకు ఏడాదిలో నాలుగు సార్లు అవకాశం కల్పించే మరో ప్రతిపాదనకు కూడా కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఏటా జనవరి 1 నాటికి 18 ఏళ్లు దాటితేనే ఓటరుగా నమోదుకు అనుమతించనున్నారు. ఇక, ఎన్నికలు నిర్వహించే ప్రాంగణాల ఎంపికపై కేంద్ర ఎన్నికల సంఘానికే, పూర్తి అధికారాలు కట్టబెడుతూ మరో సవరణ చేశారు.
elections 2022: మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్ లా ఉంది: బీజేపీ
ఇదిలా ఉండగా, ఈ యేడాది మార్చిలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లోనే దీని గురించిన చర్చ వచ్చింది. ఆ సమయంలో ఇక నుంచి ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో ప్రకటన చేసింది. ఓటు హక్కు పరిరక్షణకు వీలుగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది. తద్వారా ఇకపై ఎవరు ఓటు వేశారో.. ఎవరు వేయలేదో తెలుసుకునే వీలుంటుంది. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు లోక్‌సభకు తెలిపారు.
అంతకు ముందు 2019, ఆగస్టు లోనే ఎన్నికల కమిషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఓటర్ గుర్తింపు కార్డులను ఆధార్ నంబర్ తో అనుసంధానం చేయాలని కోరుతూ న్యాయశాఖకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాయడం గమనార్హం. ఈ అంశంపై ఈసీ న్యాయశాఖకు లేఖ రాయడం ఇదే తొలిసారి.
దీంతోపాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950కి మార్పులు చేయాలని కూడా ఈసీ ప్రతిపాదించింది. ఓటర్ కార్డును ఆధార్ తో అనుసంధానం చేయడం వల్ల నకిలీ దరఖాస్తులు, బోగస్ ఓట్లను సులభంగా ఏరివేయవచ్చని పేర్కొంది. ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం వల్ల ఒక్కొక్కరినీ ఒక్క ఓటు మాత్రమే పరిమితం చేయవచ్చంటూ చాలా కాలంగా ఈసీ చెబుతూ వస్తోంది.
గతంలో ఆధార్ అనుసంధానం స్వచ్ఛందం అని చెప్పిన ఈసీ 2016లో ఏకే జోషి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వచ్చిన తర్వాత తన వైఖరి మార్చుకోవడం గమనార్హం. కాగా ఇప్పటికే 32కోట్ల ఆధార్ నంబర్లు ఓటర్ ఐడీ కార్డులతో లింక్ అయ్యాయి.