ఇదేం కోడల్రా బాబోయ్.. అత్తామామల నగ్న వీడియోలు తీసి, భర్తకు బెదిరింపులు..

By Bukka SumabalaFirst Published Sep 20, 2022, 8:00 AM IST
Highlights

భర్తతో గొడవపడి, అతని స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. అత్తామామల న్యూడ్ వీడియోలు తీసి భర్తను బెదిరించడం మొదలుపెట్టింది. 
 

ఢిల్లీ : ప్రియుడితో కలిసి కుట్ర పన్నిన ఓ మహిళ తన సొంత అత్తమామల నగ్న వీడియోలు తీసిన దారుణ ఉదంతం ఇది.  ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిబంగారు ఆభరణాల వ్యాపారి. అతనికి తన భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారిద్దరూ ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త ఇటీవల గుర్తించాడు. బండారం బయటపడడంతో ఇంట్లో ఉన్న కోటి రూపాయలకుపైగా విలువైన ఆభరణాలు, కొంత నగదు తీసుకుని ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. 

దీంతో ఇది గుర్తించిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ విషయం భార్యకు తెలియడంతో ఆమె భర్త కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగింది. తమ ఇంట్లో అత్తామామల గదిలో రహస్య కెమెరాలు పెట్టానని.. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని వీడియోలు తీసానని.. షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.  తనపై కేసులు వెనక్కి తీసుకోకపోతే ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో ఈ విషయాన్ని కూడా భర్త పోలీసులకు తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

దారుణం.. బాలిక తననే ప్రేమిస్తుందని నిరూపించుకునేందుకు అత్యాచారం..వీడియో తీసి...

ఇదిలా ఉండగా, జార్ఖండ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై యువకుడు దాష్టీకానికి పడ్డాడు. ఆమె తనను ప్రేమిస్తోందని స్నేహితుల ముందు రుజువు చేసుకునేందుకు బాలిక మీద అత్యాచారానికి తెగబడ్డాడు.  వివరాల్లోకి వెళితే…  కోయలంచల్ ధన్ బాద్ ప్రాంతానికి చెందిన కొందరు యువకుల మధ్య ఓ బాలిక విషయంలో ఇటీవల గొడవ జరిగింది. ఆమె తనను ప్రేమిస్తుందని యువకుల్లో ఒకరు చెప్పారు. దీంతో తననే ప్రేమిస్తోందని సంజయ్ అనే మరో వ్యక్తి వాదించాడు. 

అంతేకాదు, తానే ఆమె ప్రేమికుడినని నిరూపించుకుంటానని.. వారి ముందు సవాలు చేశాడు. మరుసటిరోజు బాలికకు మాయమాటలు చెప్పి పొదల్లోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆధారాలు వీడియో తీసి స్నేహితులకు పంపించాడు. వారు ఆ వీడియోను బంధువులకు చూపించడంతో జరిగిన ఘోరం వెలుగు లోకి వచ్చింది.  బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ను అరెస్టు చేశారు.

click me!