COVID19 prevention tips: కరోనా రాకుండా ఏం చేయాలి? వస్తే ఏం చేయాలి?

Published : May 31, 2025, 10:35 PM IST
corona

సారాంశం

how to prevent COVID: భారత్ లో పాటు చాలా దేశాల్లో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. అయితే, మీరు కరోనా బారినపడకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

COVID19 prevention tips: ఇదివరకు యావత్ ప్రపంచాన్ని కలవరపరిచిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. చాలా దేశాల్లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా బారినపడకుండా మీరు, మీ పరిసరాల వారిని ఎలా రక్షించుకోవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. అలాగే, భారత ప్రభుత్వం కూడా కరోనా వైరస్ పై పలు సూచనలు చేసింది.

కోవిడ్-19 అంటే ఏమిటి?

కోవిడ్-19 అనేది 2019లో యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన ఒక మహమ్మారి వైరస్. దీనికి కారణమైన వైరస్ పేరు సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ 2 (SARS-CoV-2). ఇది ప్రధానంగా వ్యక్తుల మధ్య గాలిలోని వైరస్ ధూలికణాల ద్వారా వ్యాపిస్తుంది.

కరోనా ఎలా వ్యాపిస్తుంది?

కరోనా వైరస్‌లు శ్వాస సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. దీనివల్ల సాధారణ జలుబు నుంచి SARS, COVID-19 వరకు పలు రకాల వ్యాధులను కలిగిస్తాయి. కోవిడ్-19 ఉన్న వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు లేదా పాడినప్పుడు గాలిలోకి వైరస్ కణాలు వస్తాయి. ఈ కణాలు శ్వాసలోకి వెళ్లినప్పుడు లేదా ముఖంపై తాకినప్పుడు ఇతరులకు కోవిడ్ వైరస్ సోకుతుంది. గాలి ప్రవాహం తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ కణాలు నిమిషాల నుంచి గంటల పాటు గాలిలో ఉండవచ్చు.

కరోనా వైరస్ సోకిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి?

కోవిడ్ లక్షణాలు వైరస్ సోకిన 2–14 రోజుల తరువాత కనిపించవచ్చు. వాటిలో ముఖ్యంగా రుచి-వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, జలుబు లక్షణాలు, వాంతులు, డయేరియా, నిద్ర మత్తు, తీవ్రమైన తలనొప్పి, కొన్ని సందర్భాల్లో మూర్ఛ, ఛాతిలో నొప్పి లేదా ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి తీవ్ర లక్షణాలు ఉన్నవారు తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి.

కోవిడ్ 19 నివారణ మార్గాలు ఏమిటి?

అత్యంత సమర్థవంతమైన నివారణ మార్గం సీడీసీ (CDC) సూచించిన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడమే. ఆరు నెలల వయస్సు పైబడిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిడ్ వ్యాక్సిన్ ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర అనారోగ్య ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

కోవిడ్ 19 - ఇతర జాగ్రత్తలు

కోవిడ్ లక్షణాలతో అనారోగ్యానికి గురైన వారికి దూరంగా ఉండాలి. వైద్యులను సంప్రదించాలి. కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. 60% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ సానిటైజర్ వాడాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. గాలి ప్రసరణ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో గుంపుగా ఉండకూడదు.

కోవిడ్ 19 - మాస్క్ ధరించాలా?

అవును. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. CDC ప్రకారం, హాస్పిటల్స్‌లో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్ ధరించడం అవసరం. మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ మాత్రమే కాకుండా గాలి ద్వారా వ్యాపించే అనేక వ్యాధులు మీ దగ్గరకు రావు.

కరోనా వైరస్ సోకినట్లైతే ఏమి చేయాలి?

కరోనా పాజిటివ్ టెస్ట్ వచ్చిన వారు లేదా కోవిడ్ లక్షణాలున్న వారు వైద్యుని సంప్రదించాలి. లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలి. వైద్యుల సూచనలకు అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకోవాలి. కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, సమయానుసారంగా వైద్య సహాయం తీసుకోవడం అత్యంత కీలకం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!