Omicran: మూడు డోసులు తీసుకున్నా వదలని ఒమిక్రాన్‌..

By Mahesh Rajamoni  |  First Published Dec 18, 2021, 11:24 AM IST

Omicran: క‌రోనా వైరస్  కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా  విసురుతోంది. చాలా దేశాల్లో ఈ వేరియంట్ ప్ర‌మాద‌క‌ర స్థాయిలో వ్యాపిస్తోంది. భార‌త్ లోనూ ఈ ర‌కం కేసులు అధికం అవుతున్నాయి. ఇక మూడు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిని సైతం ఒమిక్రాన్ వ‌ద‌ల‌క‌పోవ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 
 


Omicran: క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై ఇంకా పూర్తి స్థాయి డేటా అందుబాటులో లేదు. అయితే, దీనిని అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్‌గా నిపుణులు అంచాన వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఒమిక్రాన్ వేరియంట్ ప‌లు దేశాల్లో పంజా విసురుతోంది. ఒమిక్రాన్ విజృంభ‌ణ‌కు ఆయా దేశాల్లో తీవ్ర భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి.  ఆందోళ‌న క‌లిగించే విష‌యం ఏమిటంటే.. క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న‌వారికి సైతం ఈ వేరియంట్ సంక్ర‌మించ‌డం ప్ర‌జ‌ల్లో వ‌ణుకు పుట్టిస్తున్న‌ది.  వ్యాక్సిన్‌ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా  ఒమిక్రాన్ వేరియంట్‌ వదిలిపెట్టడం లేదు.  విదేశాల నుంచి వ‌స్తున్న వారి కార‌ణంగా భార‌త్ లో ఈ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే  ఈ నెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్‌ నుంచి భార‌త్ వ‌చ్చాడు. ముంబ‌యి  విమానాశ్రయంలో అత‌నికి కరోనా పరీక్షలు  నిర్వహించగా అతనికి పాజిటివ్‌ వచ్చింది. అయితే, అత‌ను అప్ప‌టికే పూర్తి స్థాయిలో క‌రోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నాడు. అతడు ఫైజర్‌ వ్యాక్సిన్‌ మూడు డోసులు తీసుకున్నాడనీ, అయినా అతనికి వైరస్‌ సోకిందని బృహాన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (BMC) అధికారులు వెల్ల‌డించారు.

Also Read:  Omicron | అదే జరిగితే రోజుకు 14 లక్షల కేసులు.. ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు

Latest Videos

undefined

స‌ద‌రు బాధితుడు అమెరికా నుంచి ముంబ‌యి వ‌చ్చిన వెంట‌నే.. క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌డంతో పాజిటివ్ గా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే అప్ర‌మ‌త్త‌మైన అధికారులు అత‌ని శాంపిళ్ల‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపించారు. ఫ‌లితాల్లో అత‌నికి  ఒమిక్రాన్  వేరియంట్ సోకింద‌ని  తేలింది. ఇదిలావుండ‌గా, అత‌నిలో ఎలాంటి క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపించలేద‌న్నారు. అలాగే అత‌ని వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రికి నెగటివ్ రావ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుండ‌గా, ఒమిక్రాన్ బారిన‌ప‌డుతున్న వారిలో అధికంగా రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న‌వారు సైతం ఉంటున్నార‌ని యూకే, ఫ్రాన్స్ దేశాల రిపోర్టులు పేర్కొంటున్నాయి. భార‌త్‌లోరూ ఈ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. యూర‌ప్ దేశాలైన బ్రిట‌న్‌, ప్రాన్స్ దేశాల్లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు భార‌త్ ఏర్ప‌డితే నిత్యం 14 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోద‌వుతాయ‌ని  కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్ట‌ర్ వీకే పాల్ హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Also Read: CM KCR: 23న వ‌న‌ప‌ర్తికి కేసీఆర్‌.. సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు

ఇదిలావుండ‌గా, దేశంలో సాధార‌ణ క‌రోనా వైర‌స్ కొత్త కేసులు త‌క్కువ‌గానే న‌మోద‌వుతుండ‌టం కాస్త ఊర‌ట క‌లిగిస్తోంది. కానీ, అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన క‌రోనా వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 7145 కరోనా వైర‌స్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది.  మొత్తం కేసుల్లో ఇప్ప‌టివ‌ర‌కు 3,41,71,471 మంది కోవిడ్‌-19 నుంచి కోలుకున్నారు. ఇదే స‌మ‌యంలో కొత్త‌గా  8706 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం 84,565  యాక్టివ్ కేసులు ఉన్నాయి.  దీంతో యాక్టివ్‌ కేసులు 569 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగేర‌, గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ.. 289 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్‌-19 మ‌ర‌ణాల సంఖ్య  4,77,158కి పెరిగింది.   ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భార‌త్‌లో పెరుగుతున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ముమ్మ‌రంగా కొన‌సాగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,36,66,05,173 వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామ‌ని కేంద్రం వెల్ల‌డించింది.

Also Read: Amit Shah | కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాం.. కానీ.. : అమిత్ షా 

click me!