
భారత్‌లో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ (Covid Vaccination) పూర్తి చేసుకన్నవారికి కూడా ఒమిక్రాన్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మూడు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకన్న వ్యక్తికి కూడా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) శుక్రవారం వివరాలు వెల్లడించింది. న్యూయార్క్ నుంచి ఇటీవల నగరానికి వచ్చిన 29 ఏళ్ల వ్యక్తికి కోవిడ్ (Covid) పరీక్షలు నిర్వహించగా.. అతనికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో అధికారులు అతని శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపింది.
ఆ పరీక్షల్లో అతని ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్దారణ అయింది. అయితే ఆ వ్యక్తి ఎటువంటి లక్షణాలు లేవని.. ఇప్పటికే అతను ఫైజర్ వ్యాక్సిన్ (Pfizer Vaccine) మూడు డోసులు తీసుకున్నాడని తెలిపింది. అయితే ప్రస్తుతం అతనిలో ఎటువంటి లక్షణాలు గుర్తించలేదని.. కేవలం పరీక్షల ద్వారానే ఒమిక్రాన్ సోకినట్టుగా నిర్దారణ అయిందని వెల్లడించింది. ఆ వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చినట్టుగా పేర్కొంది.
Also read: ఒమిక్రాన్ వేరియంట్‌ను స్పుత్నిక్ వీ సమర్థంగా ఎదుర్కొంటుంది.. రష్యా ప్రభుత్వం
అతనితో సన్నిహితంగా ఉన్న ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా.. వారికి కోవిడ్ నెగిటివ్‌గా నిర్దారణ అయింది. జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆసుపత్రిలో చేరినట్లు బీఎంసీ పేర్కొంది. ఇక, ముంబైలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 15కు చేరింది. వీరిలో ఐదుగురు ముంబై బయటి వ్యక్తులే. అయితే ఇప్పటికే 13 మంది పెషేంట్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పటివరకు ముంబైలోని వెలుచూసిన ఒమిక్రాన్ కేసులలో ఎవరిలోనూ తీవ్రమైన లక్షణాలు లేవని బీఎంసీ తెలిపింది. మరోవైపు మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 40కి పెరిగింది.
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ చాలా స్పీడ్ గా వ్యాపిస్తోందని కేంద్రం నియమించిన కొవిడ్ టాస్క్‌ఫోర్స్ తెలిపింది. ప్రస్తుతం బ్రిటన్, ఫ్రాన్స్‌లో చూస్తున్న పరిస్థితులు భారత్‌కూడా నెలకొంటే.. కేసులు భారీగా పెరుగతాయని తెలిపింది. అలాంటి పరిస్థితులు ఇండియాలో వస్తే.. రోజుకు 14 లక్షల కేసులు నమోదవుతాయని హెచ్చరించింది. ముఖ్యంగా19 జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది.