Coronavirus: భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే..?

By Mahesh RajamoniFirst Published Dec 19, 2021, 10:39 AM IST
Highlights

Coronavirus: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగాపెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పలు యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతోంది. 
 

Coronavirus: భారత్ లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో ఈ కేసులు వెలుగుచూస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణ కరోనా వైరస్ కేసులు సైత అధికమవుతున్నాయి. ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం..  దేశంలో కొత్తగా 7081 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  ఐదు నెలల తర్వాత..అధికంగా కరోనా కొత్త కేసులు నమోదవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో కరోనా వైరస్ బారినపడ్డవారి మొత్తం సంఖ్య  3,47,40,275కు చేరింది.  ఇదే సమయంలో కోవిడ్-19 నుంచి 7,469 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి  సంఖ్య 3,42,940కు పెరిగింది. క్రియాశీల కేసులు సైతం లక్ష దిగువకు చేరాయి. మొత్తం కేసుల్లో 0.24 శాతంగా యాక్టివ్ కేసులున్నాయి. 83,913 మంది వివిధ ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు, హోం క్వారంటైన్ ఉన్నారు.

Also Read: Covid Third wave: జనవరిలో కరోనా థర్డ్ వేవ్.. కొత్తగా సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం !

 

అలాగే, గత 24 గంటల్లో  కొత్తగా కరోనా వైరస్ తో పోరాడుతూ 264 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,77,422కు పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోన రికవరీ 98.38 శాతంగా ఉంది.  మరణాల రేటు 1.37 శాతంగా  ఉంది. కోవిడ్-19 వారాంతపు కరోనా  పాజిటివిటీ రేటు 5.2 శాతంగా ఉంది.  దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 66,48,694 కరోనా వైరస్ కేసులు, 1,41,340 మరణాలు నమోదయ్యాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కరోనా కట్టడి చర్యలను వేగవంతం చేశాయి. దీనిలో భాగంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు టీకాలు తీసుకోవడానికి అర్హులైన వారిలో సగ మందికి పైగా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొత్తం 137.5 కోట్ల మొదటి డోసులు పంపిణీ చేసినట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 54.8 కోట్ల చేరిందని పేర్కొంది.

Also Read: Rahul Gandhi: గంగ‌లో మునుగుతారు కానీ… నిరుద్యోగం ఊసెత్త‌రు.. మోడీపై రాహుల్ గాంధీ సెటైర్లు 

ఇదిలావుండగా, ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోది. ఇప్పటివరకు 89 దేశాల్లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ ఉన్న ప్రాంతాల్లో ఒకటిన్నర నుంచి మూడు రోజుల వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని ఆయా దేశాల రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 274,542,057 కరోనా కేసులు నమోదయ్యాయి. 5,366,779 మంది వైరస్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. 246,344,528 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, స్పెయిన్ దేశాలు టాప్-10లో ఉన్నాయి. 
Also Read:  TS: విద్యార్థుల‌ ఆత్మ‌హ‌త్య‌లకు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త .. కేసీఆర్‌పై బండి సంజ‌య్ ఫైర్ 

click me!