Covid Third wave : దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతోంది. అత్యంత ప్రమదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కొత్త కరోనా వేవ్‌లకు కారణమవుతోంది. భారత్ లోనూ కరోనా థర్డ్ వేవ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, సూపర్ స్ట్రెయిన్ ప్రమాదం కూడా పొంచి వుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Covid Third wave : ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. బ్రిటన్, దక్షిణాఫ్రికాతో పాటు పలు యూరప్ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ.. పరిస్థితులను దారుణంగా మారుస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రతిరోజూ కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంలో పెరుగుదల చోటుచేసుకోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ను మరో కరోనా వేవ్ త్వరలోనే తాకనుందని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫిబ్రవరి నాటికి నిత్యం కొత్త కేసులు లక్షల్లో నమోదవుతాయని హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ గురించి నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా భారత్ లో జనవరి మొదటి వారంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం కావొచ్చని నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. దీని కారణండా కరోనా వైరస్ కేసులు ఫిబ్రవరి చివరి వారంలో గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశముందని హెచ్చరించింది.
Also Read: Rahul Gandhi: గంగలో మునుగుతారు కానీ… నిరుద్యోగం ఊసెత్తరు.. మోడీపై రాహుల్ గాంధీ సెటైర్లు
undefined
భారత్ లో కరోనా మొదటి వేవ్ లో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రెండో వేవ్ లో అయితే, మరణ మృదంగం మోగించింది. ప్రస్తుతం రాబోతున్న కరోనా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్‌తో పోల్చితే ఇది అంత ప్రమాదకరం కాకపోవచ్చని నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. దీనికి పలు కారణాలను ఉదాహరణగా పేర్కొంది. అందులో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో దేశంలో చాలా మంది కోవిడ్-19 వ్యాక్సిన్లు తీసుకోలేదనే విషయాన్ని పేర్కొంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ పై ఉన్న ప్రాథమిక డేటా ప్రకారం.. దీని వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ.. ప్రభావం తక్కువగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కానీ పలు యూరప్ దేశాల్లో పరిస్థితులను గమనిస్తే.. దీనికి భిన్నంగా ఉన్నాయి. ‘భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ మార్చిలో ప్రారంభమైంది. డెల్టా వేరియంట్ వచ్చేటప్పటికి చాలామంది వ్యాక్సిన్ వేసుకోలేదు. దీంతో కరోనా డెల్టా వేరియంట్ తన పంజా విసిరింది. అయితే, ప్రస్తుత పరిస్థితులు.. అప్పటితో పోలిస్తే భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో సీరో పాజిటివిటీ రేటు 75-80 శాతం మధ్యలో ఉంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు సహజ నిరోధకత ఉంది. దాదాపు 85 శాతం మంది కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. అర్హులైన జనాభాలో సగం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా మారినా.. రోజువారీ కేసులు 2 లక్షలు దాటవు’ అని నేషనల్ కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ చీఫ్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ విద్యాసాగర్ వెల్లడించారు.
Also Read: TS: విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యత .. కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విషయంలో ఇతర దేశాలతో భారత్ ను పోల్చి చూడలేమని విద్యాసాగర్ అన్నారు. ఈ వేరియంట్‌తో భారత్‌లో పెద్దగా ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారత్ లో సీరో పాజిటివిటీ రేటు అధికంగా ఉంది. చాలా మంది వైరస్ బారినపడి కోలుకున్నారు. కాబట్టి వారందరిలో కరోనా యాంటీబాడీలు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా, ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలిసి సూపర్ స్ట్రెయిన్‌గా మారే విషయంపై చర్చ జరుగుతోంది. దీనిపై మోడెర్నా చీఫ్ మెడికల్ ఆఫీసర్ పాల్ బర్టన్ మాట్లాడుతూ.. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ కలిసి సూపర్ స్ట్రెయిన్‌గా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అన్నారు. ఒకే వ్యక్తికి ఒకే సమయంలో డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ రెండూ సోకితే రెండు వేరియంట్లు పరస్పరం జన్యువులను మార్చుకొని అతని నుంచి సూపర్ స్ట్రెయిన్ తయారు కావచ్చునని ఆయన పేర్కొన్నారు. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. పలు యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ కేసులతో పాటు డెల్టా వేరియంట్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
Also Read: up assembly elections 2022: ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం: అఖిలేష్ యాదవ్