65 ఏళ్లు.. 43 పుష్ అప్‌లు.. కాలేజీ ఫెస్ట్‌లో బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ హల్‌చల్

Published : Dec 18, 2021, 08:08 PM ISTUpdated : Dec 18, 2021, 08:10 PM IST
65 ఏళ్లు.. 43 పుష్ అప్‌లు.. కాలేజీ ఫెస్ట్‌లో బీజేపీ నేత కైలాస్ విజయవర్గీయ హల్‌చల్

సారాంశం

బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయవర్గీయ ఓ కాలేజీ ఫెస్ట్‌లో పుష్ అప్‌లతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 65 ఏళ్ల వయసులో ఆయన సుమారు 43 పుష్ అప్‌లు తీశారు. చుట్టూ ఉన్న విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు కౌంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుండగా ఆయన పుష్ అప్‌లు చేశారు. ఈ వీడియో జఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గతంలోనూ ఆయన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చైహాన్‌తో కలిసి పాడారు.  

భోపాల్: బీజేపీ సీనియర్ నేత (BJP Senior Leader) కైలాస్ విజయవర్గీయ (Kailas vijayvargiya) ఓ కాలేజీ ఫెస్ట్‌లో హల్ చల్ చేశారు. 65 ఏళ్లు నిండినా.. తన ఫిట్‌నెస్‌ (Fitness)తో అందరినీ ఆయన ఆశ్చర్యంలో ముంచేశాడు. కుర్రకారు.. విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు కేరింతలు కొడుతుండగా ఆయన స్టేజీపై 40కి పైగా పుష్ అప్‌లు (Push Ups) చేసి కుదోస్ అనిపించుకున్నారు. అందరూ.. కౌంట్ చేస్తూ ప్రోత్సహిస్తుండగా ఆయన తన వీర ఫిట్‌నెస్‌ను ప్రదర్శించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ (Viral) అవుతున్నది. ఆ వీడియోను బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ జితేంద్ర జిరాటి ట్వీట్ చేశారు.

మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని ఆర్‌పీఎల్ మహేశ్వరీ కాలేజీ వార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేడుకలో కైలాస్ విజయవర్గీయను అందరూ ఎంకరేజ్ చేయడంతో ఆయన ఎక్సర్‌సైజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. స్టేజీపై ఆయన పుష్ అప్‌లు తీయడం మొదలు పెట్టగానే క్రౌడ్ మొత్తం కౌంట్ చేస్తూ ఆయనకు హుషారు ఇచ్చారు. ఆయన ఆగకుండా సుమారు 43 పుష్ అప్‌లు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 65 ఏళ్ల వయసులోనూ ఆగకుండా 40కి పైగా పుష్ అప్‌లు చేయడంపై పొగడ్తలు కురిపించారు. కొందరైతే ఆయనను పహెల్వాన్ అని సంభోదించారు. ఇంకొందరు ఆయన పుష్ అప్‌లు సరిగా తీయలేదనీ ఫిర్యాదులు చేశారు.

Also Read: సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు చేయించిన మిలింద్‌.. చివరికి విమర్శలపాలు..

ఇలాంటి యాక్టివిటీస్‌లు కైలస్ విజయవర్గీయ ఎప్పటి నుంచో యాక్టివ్‌గా ఉంటారు. దీనికంటే ముందు ఆయన పాడటంలోనూ తన ప్రతిభను బయటపెట్టుకున్నారు. కైలాస్ విజయవర్గీయ.. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలుసార్లు కలిసి పాటలు పాడిన దాఖలాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ బిల్డింగ్‌లో నిర్వహించిన బుట్టా పార్టీలో వారు కలిసి పాటలు పాడారు. షోలే సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ చోడేంగే అనే పాట పాడారు. కుద్రత్ సినిమాలోని హమే తుమ్సే ప్యార్ కిత్నా అనే పాటనూ పాడారు. అక్కడే ఉన్న వారి సహచరులు వీడియో తీశారు. వారు పాడుతున్న ఆ వీడియోను కైలాస్ విజయవర్గీయ స్వయంగా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. యువ మోర్చా రోజుల్లో వారు తరుచూ కలిసి పాడే వారని పేర్కొన్నారు. భుట్టా పార్టీలో బీజేపీతోపాటు ప్రతిపక్షమూ పాల్గొనడం గమనార్హం.

Also Read: వైరల్ వీడియో : కదులుతున్న కారు మీద యువకుడి పుషప్స్.. ట్విస్టిచ్చిన పోలీసులు..

గతంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఓ కాలేజీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ పుష్ అప్‌లు తీసిన సంగతి తెలిసిందే. ఆయన విద్యార్థులతో మమేకం అవుతూ స్టేజీపై పుష్ అప్‌లు తీశారు. అప్పుడు కూడా చుట్టూ ఉన్నవారు కౌంట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో ఆయన తమిళనాడులోని ఓ కాలేజీ వెళ్లినప్పుడు ఓ విద్యార్థిని ఆయనకు సవాల్ విసిరింది. 15 పుష్ అప్‌లు తీయాల్సిందిగా సవాల్ విసిరింది. ఈ సవాల్‌ను ఆయన స్వీకరించారు. అక్కడే కాలేజీలోనే స్టేజీపై పుష్ అప్‌లు తీశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్