పెరిగిన కరోనా కేసులు, మరణాలు.. ఒక్క రోజే 666 మంది కొవిడ్ పేషెంట్లు మృతి

By telugu teamFirst Published Oct 23, 2021, 1:42 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. సింగిల్ డేలో 16,326 కరోనా కేసులు, 666 కరోనా మరణాలు రిపోర్ట్ అయ్యాయి. కేరళ ప్రభుత్వం కరోనా మరణాలను సవరించడంతో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగాయి. కాగా, యాక్టివ్ కేసులు 233 రోజుల కనిష్టానికి పడిపోయాయి.
 

న్యూఢిల్లీ: ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడుకలకూ దూరంగా ఉండాలని వైద్య నిపుణులు పలుసార్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లో ఒక్క ఉదుటున కరోనా కేసులు పెరగడంతో దుర్గా పూజా కార్యక్రమాల వల్లే కేసులు పెరిగాయని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. తాజాగా, దేశవ్యాప్తంగా Coronavirus Cases, అలాగే Deaths పెరిగాయి. గడిచిన 24 గంటల్లోనే 16,326 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. కరోనా మరణాలు పెరిగాయని వివరించింది. దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 666 చోటుచేసుకున్నట్టు Union Health Ministry పేర్కొంది. అయితే, Kerala ప్రభుత్వం మరణాల సంఖ్యను సవరించడంతో ఇవి పెరిగినట్టు స్పష్టమవుతున్నది.

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 16,326 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు 666గా రిపోర్ట్ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,41,59,562కు మొత్తం మరణాలు 4,53,708కు చేరాయి. కాగా, 17,677 మంది ఈ మహమ్మారి నుంచి రికవరీ అయ్యారు. Active కేసులు మరో 2,017 తగ్గుముఖం పట్టాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728కు పడిపోయాయి. గతేడాది మార్చి 20వ తేదీ తర్వాత ఇంత దిగువకు చేరడం ఇదే తొలిసారి. కాగా, కొత్త కేసుల సంఖ్య కూడా 30వేలకు దిగువగా రిపోర్ట్ అవడం ఇది వరుసగా 29వ సారి. కాగా, గత 118 రోజులుగా కరోనా కేసులు 50వేలకు మించకపోవడం గమనార్హం.

ఇందులోనూ అత్యధిక కేసులు కేరళ నుంచే రిపోర్ట్ అయ్యాయి. ఒక్క కేరళలోనే సుమారు 9వేల కేసులు నమోదవ్వగా, మహారాష్ట్ర, తమిళనాడులలో సుమారు వెయ్యి కేసుల చొప్పున రిపోర్ట్ అయ్యాయి. కాగా, ఈశాన్య రాష్ట్రం మిజోరం కూడా అధికంగానే(745) కరోనా కేసులను నమోదు చేసింది. దేశంలో ఈ నాలుగు రాష్ట్రాల్లోనే అధిక యాక్టివ్ కేసులున్నాయి. 

Also Read: Delta Variant AY 4.2 : యూకేను వణికిస్తున్న కొత్త రకం వేరియంట్

ఒక్క కేరళలోనే 563 మరణాలను రిపోర్ట్ అయ్యాయి. ఇందులో గడిచిన 24 గంటల్లో చోటుచేసుకున్న మరణాల సంఖ్య 271గా ఉండగా, గతంలో చోటుచేసుకున్న మరో 292 మరణాలనూ తాజాగా వెల్లడించింది. దీంతో ఒక్క కేరళలోనే 563 మరణాలు నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా తాజా మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగి 666కు చేరింది.

click me!