పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు.. కోవిడ్ టీకాలు, సంక్షేమ పథకాలకు నిధులు.. కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ సమర్దన

By team telugu  |  First Published Oct 23, 2021, 11:43 AM IST

పెట్రోల్, డీజిల్ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఇందన పన్నులను  తగ్గించాలన్న డిమాండ్ ప్రతిపక్ష  పార్టీల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర  పెట్రోలియం శాఖ  మంత్రి  హర్‌దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత  సంతరించుకున్నాయి.


దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol and diesel Prices) సామాన్యులకు చుక్కలు  చూపిస్తున్నాయి. ఈ ధరల పెంపుకు సంబంధించి వాహనదారులు  తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఇందన పన్నులను  తగ్గించాలన్న డిమాండ్ ప్రతిపక్ష  పార్టీల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర  పెట్రోలియం శాఖ  మంత్రి  హర్‌దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత  సంతరించుకున్నాయి. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్‌పై టారిఫ్‌లను(Petrol, diesel taxes) సమర్ధించారు. ఈ సుంకాలు.. కరోనా మహమ్మారి సమయంలో లక్షలాది మందికి ఉచిత కోవిడ్ వ్యాక్సిన్లు, భోజనం, వంట గ్యాస్ అదించిన ప్రభుత్వ కార్యక్రమాలను మద్దతుగా నిలిచాయని పేర్కొన్నారు. 

అంతర్జాతీయ  చమురు ధరలపై దేశీయ రేట్లు  ఆధారపడి  ఉన్నాయని  హర్‌దీప్  సింగ్ పూరి  చెప్పారు. దేశంలో  ఇంధన ధరలు  వివిధ కారణాల వల్ల పెరిగినట్లుగా గుర్తించాలని కోరారు. ధరలు ఎందుకు పెరిగాయి..?, ధరలు పెరిగినప్పుడు పన్నులు  ఎందుకు తగ్గించరు..? అని ప్రశ్నించడం.. భారత్‌లో సాధారణంగా మనకు వినిపించే రాజకీయ విమర్శ అని Hardeep Singh Puri అన్నారు.

Latest Videos

undefined

‘కేంద్రం 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. కరోనా మహ్మమారి సమయంలో ఏడాది పాటు 90 కోట్ల మంది రోజుకు మూడు పూటల భోజనం అందేలా చేసింది. 8 కోట్ల మంది పేదలకు ఉచితంగా వంట గ్యాస్ అందించే ఉజ్వల పథకాలను అందించింది. వీటితో పాటు మరెన్నింటినో లీటర్‌పై రూ. 32 ఎక్సైజ్ డ్యూటీ(కేంద్ర ప్రభుత్వం విధించే సుంకం)  వల్లనే  జరిగింది’అని మంత్రి చెప్పారు. 

Also read: ఆన్‌లైన్‌లో ఐఫోన్‌ 12 ఆర్డర్ చేశాడు.. డెలివరీ బాక్సులో సబ్బు, 5 రూపాయిల నాణెం.. పోలీసుల విచారణలో ఏం తేలిందంటే

పన్నులు తగ్గించాలనే డిమాండ్‌పై స్పందిస్తూ..తాను ఆర్థిక మంత్రిని కాదని.. కనుక ఇందుకు సరైన సమాధానం తాను ఇవ్వలేనని మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు. లీటర్‌పై తాము సేకరించే 32 రూపాయలు.. 100 కోట్ల వ్యాక్సిన్‌లతో సహా సంక్షేమ సేవలను అందించే సామర్థ్యాన్ని  అందిస్తుందని మంత్రి  పేర్కొన్నారు. ఇక, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకాయి. దేశంలో దాదాపు అన్ని  చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటేసింది. కొన్ని  చోట్ల రూ. 110 గా ఉంది. మరోవైపు పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటేసింది. 
 

click me!