విదేశీయులను దగ్గరకు రానివ్వని భారతీయులు: స్మశానంలో పడుకున్న ఫ్రెంచ్ వాసి

By Siva KodatiFirst Published Mar 17, 2020, 7:40 PM IST
Highlights

కరోనా కారణంగా భారతదేశంలో విదేశీయుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మనదేశంలోకి ఈ వైరస్ తొలుత విదేశీయుల నుంచే రావడంతో భారతీయులు వారిపై వివక్ష చూపుతున్నారు. వీరికి సాయం చేసేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

కరోనా కారణంగా భారతదేశంలో విదేశీయుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మనదేశంలోకి ఈ వైరస్ తొలుత విదేశీయుల నుంచే రావడంతో భారతీయులు వారిపై వివక్ష చూపుతున్నారు. వీరికి సాయం చేసేందుకు ప్రజలు ముందుకు రాకపోవడంతో విదేశీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేరళ పర్యటనలో ఉన్న ఓ అర్జెంటీనాకు చెందిన మరియా అనే మహిళ తిరువనంతపురం శివార్లలో అర్థరాత్రి రోడ్డుపై నిలబడి సాయం కోసం అర్ధించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నగరంలోని ఏ హోటల్‌, లాడ్జ్‌లోనూ తనకు వసతి సౌకర్యం ఇవ్వట్లేదని ఆమె కన్నీటి పర్యంతమైంది.

Also Read:మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే

చివరికి పోలీసులను వేడుకున్నా ఫలితం లేకపోయింది.. అయితే చివరికి ఓ అంబులెన్స్‌లో మరియాను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. స్పెయిన్‌కు చెందిన డేవిడ్, లాయా అనే భార్యాభర్తలదీ కూడా ఇదే పరిస్ధితి. కొట్టాయం సందర్శనకు వచ్చిన వీరికి స్థానికంగా ఏ హోటల్ యాజమాన్యమూ వసతి సౌకర్యం ఇవ్వడం లేదు. వారికి కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినప్పటికీ 28 రోజుల పాటు క్వారంటైన్ చేశారు.

ఇక కొట్టాయం జిల్లాలోనే వాగ్‌మోన్‌లో ఓ ఫ్రెంచ్ జాతీయుడిని ఎవ్వరూ దగ్గరకు రానివ్వకపోవడంతో పాటు వసతి సౌకర్యం కల్పించకపోవడంతో ఆయన తన లగేజ్ తీసుకుని ఓ స్మశానంలో నిద్రించడం పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది.

Also Read:కరోనా ఎఫెక్ట్: పూర్తి స్థాయి షట్ డౌన్ దిశగా భారత్, ఎక్కడికక్కడ కట్టడి

భారత ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ విదేశీయుల వల్లనే ఇండియాలోకి వైరస్ ప్రవేశిస్తోందని అధికారులు చెబుతున్నారు. కేరళలో ప్రస్తుతం 5,150 మంది విదేశీయులున్నారు. స్పెయిన్‌కు చెందిన వ్యక్తి నుంచి 25 మంది డాక్టర్లు సహా 75 మందికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. 

click me!