కొత్త డ్రామా: విడాకులు కోరిన నిర్భయ దోషి అక్షయ్ ఠాకూర్ భార్య

By telugu teamFirst Published Mar 17, 2020, 6:04 PM IST
Highlights

నిర్భయ కేసు దోషుల్లో ఒక్కడైన అక్షయ్ ఠాకూర్ భార్య విడాకుల కోసం ఔరంగాబాద్ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసుకుంది. తాను విధవగా బతకదలుచుకోలేదని, తనకు విడాకులు మంజూరు చేయాలని చెప్పింది.

న్యూఢిల్లీ: నిర్భయ రేప్, హత్య కేసులోని దోషుల్లో ఒక్కడైన అక్షయ్ ఠాకూర్ భార్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికి నలుగురు దోషులకు అన్ని మార్గాలు మూసుకపోవడంతో ఆక్షయ్ ఠాకూర్ భార్య పునీత కొత్త డ్రామా ప్రారంభించింది.

ఔరంగాబాద్ ప్యామిలీ కోర్టులో ఆమె విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తను అత్యాచారం కేసులో దోషిగా తేల్చి అతనికి ఉరిశిక్ష విధించారని, కానీ అతను నిర్దోషి అని, తాను విధవను కాదలుచుకోలేదని ఆమె తన పిటిషన్ లో చెప్పింది. 

Also Read: నేను ఆ రోజున ఢిల్లీలోనే లేను.. నాకు ఉరేలా వేస్తారు: కోర్టుకెక్కిన నిర్భయ దోషి

హిందూ వివాహ చట్టం 13(2)(11) ప్రకారం కొన్ని ప్రత్యేక కేసుల్లో విడాకులు తీసుకోవడానికి అవకాశం ఉందని, ఆ ప్రత్యేక కేసుల్లో అత్యాచారం కూడా ఉందని అక్షయ్ ఠాకూర్ భార్య తరఫు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ చెప్పారు. తన భర్త అత్యాచారం కేసులో దోషి అని తేలితే భార్య విడాకులు తీసుకోవచ్చునని ఆయన చెప్పారు. 

న్యాయనిపుణులు దాన్ని డ్రామాగా అభివర్ణిస్తున్నారు. ఈ విడాకుల పిటిషన్ పై కోర్టు అక్షయ్ కుమార్ కూడా నోటీసు జారీ చేసే అవకాశం లేకపోలేదు. 

Also Read: తేదీలు మారతాయేమో అంతే.. శిక్ష తప్పదు: నిర్భయ తల్లి వ్యాఖ్యలు

నిర్భయ కేసులోని నలుగురు దోషులకు మార్చి 20వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాలని పాటియాల హౌస్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆమెను ఆరుగురు వ్యక్తులు చిత్రహింసల పాలు చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 
ఆరుగురు నిందితుల్లో ఒక్కడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. ప్రధాన నిందితుడు రామ్ సింగ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.

click me!