మధ్యప్రదేశ్ లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. విటుడిగా మారిన కానిస్టేబుల్.. చివరికి...

By AN TeluguFirst Published Oct 11, 2021, 2:37 PM IST
Highlights

ఈ సెక్స్ రాకెట్ గుట్టును బట్టబయలు చేసేందుకు పోలీసులు ఒక కానిస్టేబుల్ ని విటునిగా వ్యభిచారం జరుగుతున్న ఇంటికి పంపించారు. అక్కడికి అతను విటునిలాగే వెళ్లాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బేరం ఆడాడు. చివరికి అతను ఐదు వందల రూపాయలతో ఒక మహిళతో బేరం కుదుర్చుకున్నాడు.

మధ్య ప్రదేశ్ లోని కట్నీ జిల్లాలో గల కోట్లలో జరుగుతున్న sex racket ను పోలీసులు అడ్డుకట్ట వేశారు. ఇక్కడ వ్యభిచార గృహం నడుపుతున్న నలుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మహిళలతోపాటు అభ్యంతరకర స్థితిలో ఉన్న ఒక యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఎంతగా అదుపుచేసినా, ఎన్నిసార్లు అరెస్టులు, వారెంట్లు జారీ చేసినా ఆగని అక్రమాల్లో సెక్స్ రాకెట్ ఒకటి. అమాయకమైన అమ్మాయిల్ని prostitutionలోకి దింపి ప్లెష్ ట్రేడ్ చేయడం కనిపిస్తూనే ఉంటుంది. అయితే బైటికి మాత్రం ఇదేమీ తెలియకుండా కవర్ చేస్తుంటారు. అలాంటి వాటిని కనిపెట్టాలంటే పక్కా సమాచారమే కాదు... ప్లానింగ్ కూడా ఉండాలి. దీనికోసం పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలు ఓరుస్తుంటారు. అలాంటి ఘటనే జరిగింది కట్నీలో...

కథ అడ్డం తిరిగింది.. డిప్యూటీ కలెక్టర్ ఇంట్లోకి దోపిడీకి వెళ్లి.. షాకింగ్ లేఖ రాసి వచ్చిన దొంగ

ఈ సెక్స్ రాకెట్ గుట్టును బట్టబయలు చేసేందుకు పోలీసులు ఒక కానిస్టేబుల్ ని విటునిగా వ్యభిచారం జరుగుతున్న ఇంటికి పంపించారు. అక్కడికి అతను విటునిలాగే వెళ్లాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా బేరం ఆడాడు. చివరికి అతను ఐదు వందల రూపాయలతో ఒక మహిళతో బేరం కుదుర్చుకున్నాడు.

ఆ తర్వాత ఆ విషయాన్ని ఇంటి బయట కాపుకాస్తున్న పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసుల బృందం ఆ ఇంట్లోకి దూసుకువచ్చింది... వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలను అదుపులోకి తీసుకున్నారు.  ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ శివాజీ నగర్ లో వ్యభిచారం జరుగుతుందని తమకు సమాచారం రావడంతో వారిని పట్టుకునేందుకు పక్కా ప్లానింగ్తో వెళ్ళమని చెప్పారు. సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశామని తెలిపారు 

click me!