ఉగ్రవాదులపై ఏ చర్యకు దిగినా మోడీకి అండగా ఉంటా: రాహుల్ గాంధీ

By Siva KodatiFirst Published Feb 15, 2019, 1:21 PM IST
Highlights

ఉగ్రవాదులపై ఎలాంటి చర్యకు దిగినా తామంతా ప్రధాని నరేంద్రమోడీకి అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పుల్వామా ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. 

ఉగ్రవాదులపై ఎలాంటి చర్యకు దిగినా తామంతా ప్రధాని నరేంద్రమోడీకి అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. పుల్వామా ఉగ్రదాడిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. ఉగ్రవాదుల అంతిమ లక్ష్యం దేశాన్ని విభజించడమేనని, అందుకే వారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని రాహుల్ మండిపడ్డారు.

తీవ్రవాదులు ఎంతగా ప్రయత్నించినా ఒక్క సెకను పాటు కూడా భారతదేశ ప్రజలను వేరు చేయలేరన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరం ఒక్కతాటిపై నిలవాలని, అప్పుడే మన ఐక్యత గురించి వారికి తెలుస్తుందని పేర్కొన్నారు.

ఇది నివాళులు ఆర్పించాల్సిన సమయమని, దేశమంతా విషాదం అలుముకుందని జవాన్ల త్యాగాలను గౌరవించుకోవాల్సిన అవసరముందన్నారు. జవాన్లపై జరిగిన దాడి పిరికిపంద చర్య అని.. ఈ విషయం తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. ఈ దాడిలో మరణించిన సైనికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

పుల్వామా దాడి: ‘‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ’’హోదాను ఉపసంహరించిన భారత్

రక్తం తాగే రాక్షసుడు: జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

click me!