వాలంటైన్స్ డే: ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకొన్న యువకుడు

Published : Feb 15, 2019, 01:03 PM IST
వాలంటైన్స్ డే: ట్రాన్స్ జెండర్‌ను పెళ్లి చేసుకొన్న యువకుడు

సారాంశం

వాలంటైన్స్‌ డే రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.  తన కుటుంబసభ్యులను ఎదిరించి  ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.


ఇండోర్: వాలంటైన్స్‌ డే రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి  చెందిన ఓ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.  తన కుటుంబసభ్యులను ఎదిరించి  ఆ వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకొన్నాడు.

మధ్యప్రదేశ్‌కు జునైద్‌ఖాన్,ట్రాన్స్ జెండర్ జయా సింగ్‌ను ఏడాదిగా ప్రేమిస్తున్నాడు.  రెండు వారాల క్రితం జునైద్ ఖాన్ జయాసింగ్‌కు ప్రపోజ్ చేశాడు. జునైద్ ప్రపోజ్‌కు జయాసింగ్ ఒప్పుకొంది.  ఈ ఇద్దరూ కూడ  వాలంటైన్స్ డే రోజున హిందూ సంప్రదాయం ప్రకారంగా ఓ దేవాలయంలో పెళ్లి చేసుకొన్నారు.

 మా పెళ్లికి మా కుటుంబం ఒప్పుకోవాలని కోరింది. ఒకవేళ వారు ఒప్పుకోకపోయినా కూడ తాను జయతోనే ఉంటానని జునైద్ ప్రకటించారు.  తామిద్దరం కూడ కొంత కాలంగా ప్రేమించుకొంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  

జునైద్ కుటుంబం ఈ పెళ్లికి ఓప్పుకోరు. అయినా కుటుంబాన్ని ఎదిరించి అతను పెళ్లి చేసుకోవడం పట్ల జయాసింగ్  హర్షం వ్యక్తం చేశారు. జునైద్ కుటుంబం ఎప్పటికైనా తమ పెళ్లిని అంగీకరిస్తారని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.

PREV
click me!

Recommended Stories

తమిళనాట ఎన్నికలు కమలహాసన్ కీలక సందేశం in Tamil Nadu Elections | Asianet News Telugu
కేరళ త్రిస్సూర్‌లో భారీ పేలుడు 40 మందికి పైగా | Massive Explosion in Kerala | Asianet News Telugu