పుల్వామా దాడి: ‘‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ’’హోదాను ఉపసంహరించిన భారత్

By Siva KodatiFirst Published Feb 15, 2019, 12:55 PM IST
Highlights

కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపధ్యంలో భారత్.. పాకిస్తాన్‌పై కన్నెర్న చేసింది. దాడికి తామే కారణమని ప్రకటించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కేంద్ర స్థానం పాకిస్తాన్ కావడంతో పాటు ఐఎస్ఐ హస్తం కూడా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి

కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి నేపధ్యంలో భారత్.. పాకిస్తాన్‌పై కన్నెర్న చేసింది. దాడికి తామే కారణమని ప్రకటించిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కేంద్ర స్థానం పాకిస్తాన్ కావడంతో పాటు ఐఎస్ఐ హస్తం కూడా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

పుల్వామా దాడి తర్వాత ప్రధాని నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ శుక్రవారం అత్యవసరంగా సమావేశమైంది. భేటీ అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు.

‘‘పాకిస్తాన్‌ను అత్యంత ప్రాధాన్యత దేశాల జాబితా నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు నిర్ణయించామన్నారు. ప్రపంచ వేదికపై పాక్‌ను ఏకాకిగా చేయడానికి విదేశాంగ శాఖ అన్ని చర్యలు తీసుకోనుందని జైట్లీ ప్రకటించారు.

44 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఘటన వెనుక పాక్ హస్తమున్నట్లు ఆధారాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అరుణ్ జైట్లీ తెలిపారు. సైనికులపై దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. భారత సహనాన్ని రెచ్చగొడుతున్న పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జైట్లీ హెచ్చరించారు. అమర జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

రక్తం తాగే రాక్షసుడు: జైషే మొహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్

42 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్ట్: ఎవరీ ఆదిల్?

"నేను స్వర్గంలో ఉంటా": జవాన్లపై దాడి చేసిన ఉగ్రవాది చివరి మాటలు

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి... 350 కిలోల పేలుడు పదార్థాలతో

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి తెగబడిన ముష్కరులు..20మంది ఆర్మీ జవాన్ల మృతి

click me!