
అయోధ్య రామ మందిరం సమస్యను కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాల్లో పొడిగిస్తూ వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం కొంత కాలంలోనే దానికి పరిష్కారం చూపిందని తెలిపారు. “అప్పుడు మోడీ జీ వచ్చారు. ఒకరోజు ఉదయం సుప్రీంకోర్టు ఉత్తర్వు వచ్చింది. 'రామ్‌లల్లా' ఆలయానికి భూమి పూజ చేసి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు’’ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా అమిత్ షా గుజరాత్‌లోని బోటాడ్ జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో 54 అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం - ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
మోడీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాల వల్ల అల్లర్లు జరుగుతాయని భావించారని, అందులో ఆర్టికల్ 370, రామజన్మభూమి వంటి అంశాలు ఉన్నాయని అన్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని షా అన్నారు.
ప్రధానిని పొగడాలని నాకెవరూ చెప్పలేదు.. నా మనసులో ఉన్నది మాట్లాడాను - పద్మ అవార్డు గ్రహీత క్వాద్రీ
‘‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే కాశ్మీర్‌లో రక్తనదులు ప్రవహిస్తాయని, రామజన్మభూమి తీర్పు వెలువడి అక్కడ దేవాలయం నిర్మిస్తే అల్లర్లు చెలరేగుతాయని బెదిరించారు. అయితే రక్తపు నదులు ప్రవహించడం, అల్లర్లు చేయడం మర్చిపోండి.. ఇప్పుడు అక్కడ ఎవరూ ఒక గులకరాయి విసిరేందుకు కూడా సాహసించరు.’’ అని అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోఘల్ చరిత్రను ప్రమోట్ చేస్తోందని కాంగ్రెస్ ను పరోక్షంగా విమర్శించారు.
గౌతమ్ అదానీకి చైనా సంస్థతో, పౌరులతో సంబంధాలున్నాయ్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
‘‘గతంలో విదేశీ నేతలు గుజరాత్‌లో పర్యటిస్తే వారికి సీడీ సయ్యద్ నీ జలీ, తాజ్‌మహల్ ప్రతిరూపాలు ఇచ్చేవారు. అందులో తప్పు ఏమీ లేదు. అయితే ఈ రోజుల్లో భగవద్గీత ప్రతులను ఈ సందర్శకులకు అందజేస్తున్నారు. ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనలో వివిధ దేశాల్లో ఉన్న 360 విగ్రహాలు భారత్ కు తీసుకొచ్చారు. వాటిలో కొన్ని 1,000 సంవత్సరాల కంటే ఎక్కువ పురాతనమైనవి ఉన్నాయి. వాటిని మన దేశంలోని వివిధ దేవాలయాల్లో తిరిగి ప్రతిష్టించారు’’ అని ఆయన అన్నారు.