
ఉత్తరాఖండ్ లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్ కు 155 కిలోమీటర్ల దూరంలోని తుని బ్రిడ్జి సమీపంలో ఉన్న ఓ బిల్డింగ్ సిలిండర్ పేలింది. దీంతో ఒక్క సారిగా ఆ ఇంటికి మంటలు అంటుకున్నాయి. అయితే ఈ మంటల్లో నలుగురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. ఈ అగ్నిప్రమాదం తీవ్రత వల్ల ఇళ్లు మొత్తం దగ్ధమయ్యింది. ఈ సమయంలో ఇంట్లో ఉన్న మరికొన్ని సిలిండర్లు కూడా ఒక దాని తరువాత మరొకటి పేలాయి.
తక్కువ చదువుకున్న ప్రధాని దేశానికి ప్రమాదకరం - ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా
తునిలోని రామ్ జోషికి చెందిన నాలుగు అంతస్తుల భవనంలో సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ భవనంలో ఇంటి యజమానితో పాటు ఐదు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఐదుగురు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. సాయంత్రం అద్దెదారుల్లో ఒకరైన విక్కీ భార్య కుసుమ్ వంటగదిలో ఎల్పీజీ సిలిండర్ మారుస్తుండగా అకస్మాత్తుగా సిలిండర్ కు మంటలు అంటుకున్నాయి. కుసుమ్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే మంటలు ఇంటిని చుట్టుముట్టాయని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
ఇంటి నుంచి పొగలు రావడాన్ని చూసి ఇతర కుటుంబ సభ్యులు అలారం మోగించారు. దీంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అందులో కూడా నీరు తక్కువగా ఉండటంతో కేవలం పది నిమిషాల్లో ఆగిపోయింది. దీంతో నీటిని నింపుకునేందుకు బయటకు వెళ్లిన అగ్నిమాపక యంత్రాలు తిరిగి వచ్చే సరికే మంటలు మరింత ఎక్కువయ్యాయి. మోరి నుంచి మరో ఫైర్ ఇంజన్ వచ్చినా.. అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.
ప్రధానిని పొగడాలని నాకెవరూ చెప్పలేదు.. నా మనసులో ఉన్నది మాట్లాడాను - పద్మ అవార్డు గ్రహీత క్వాద్రీ
ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన చిన్నారుల్లో ఒకరిని తుని జక్తాకు చెందిన త్రిలోక్ కుమార్తె గుంజన్ (10)గా గుర్తించారు. అలాగే ఇందులో హిమాచల్ ప్రదేశ్ లోని బిక్తాడ్ కు చెందిన జైలాల్ కుమార్తె రిద్ధి (10), తునిలోని పాతాళకు చెందిన విక్కీ చౌహాన్ కుమార్తె అదిరా అలియాస్ మిస్తీ (6), తుని పాతాళకు చెందిన విక్కీ చౌహాన్ కుమార్తె సెజల్ (3) ఉన్నారు. వీరితో పాటు 15 ఏళ్ల స్వాతి, విక్కీ చౌహాన్, భగత్, కుసుమ్ లకు గాయాలు అయ్యాయి. కుసుమ్ పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించారు.
గౌతమ్ అదానీకి చైనా సంస్థతో, పౌరులతో సంబంధాలున్నాయ్ - కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
కాగా.. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రీతమ్ సింగ్, మున్నా సింగ్ చౌహాన్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు మధు చౌహాన్ ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.