పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు.. ఖర్గే, సిద్దూల కీలక భేటీ.. 

Published : Apr 07, 2023, 12:44 PM IST
పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు.. ఖర్గే, సిద్దూల కీలక భేటీ.. 

సారాంశం

పంజాబ్ రాజకీయాలు: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం సిద్దూ ట్వీట్ చేస్తూ ఖర్గే నిరుపేదలకు ఛాంపియన్‌గా అభివర్ణించారు.

పంజాబ్ రాజకీయాలు: కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ కొనసాగుతోంది. సిద్ధూ గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కలిశారు. నేడు ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించిన ఫోటోను తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ..  సిద్ధూ ఇలా రాశారు. '9 సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు ఎంపీ, అణగారిన వర్గాల ఛాంపియన్(నాయకుడు), పేదల వాయిస్.. "క్రెడిబిలిటీ తేరా నామ్ మల్లికార్జున్ ఖర్గే". కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశీర్వదించారు. ఆయన పార్టీకి సానుకూల శక్తిని, అదృష్టాన్ని తీసుకొచ్చారు. అని అన్నారు. 

'రాహుల్‌కు తన గురువు చెప్పాను'

నవజ్యోత్ సింగ్ సిద్ధూ గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను కలిశారు. సమావేశం తరువాత,సిద్దూ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు నేను న్యూఢిల్లీలో నా గురువు రాహుల్‌ను,స్నేహితుడు, తత్వవేత్త, గైడ్ ప్రియాంక జీని కలిశాను. మీరు నన్ను జైలులో పెట్టవచ్చు, నన్ను భయపెట్టవచ్చు, నా ఆర్థిక ఖాతాలన్నింటినీ బ్లాక్ చేయవచ్చు, కానీ పంజాబ్ పట్ల నా నిబద్ధత మరియు నా నాయకులు తలవంచరు లేదా ఒక్క అంగుళం కూడా వెనక్కి కదలరు! అని ట్వీట్ చేశారు. 

త్వరలో కీలక బాధ్యతలు 

జైలు నుంచి వచ్చినప్పటి నుంచి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంల్లో  ఆయన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సిద్ధూ ఆరోపించారు. పంజాబ్ ఈ దేశానికి కవచమని, ఈ కవచాన్ని బద్దలు కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

అదే సమయంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు,అప్పులపై సిఎం భగవంత్ మాన్‌ను విమర్శించారు. ఆయనను పత్రికా ముఖ్యమంత్రి అని అబివర్ణించారు.ఈ క్రమంలో త్వరలో సిద్ధూకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Jaipur Army Day Parade 2026 | CDS Anil Chauhan | Rajasthan CM Bhajanlal Sharma | Asianet News Telugu
జైపూర్‌లో వీర జవాన్లకు నివాళులు: CDS అనిల్ చౌహాన్, COAS జనరల్ ఉపేంద్ర ద్వివేది | Asianet News Telugu