'నకిలీ వార్తలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం'

By Rajesh KarampooriFirst Published Mar 22, 2023, 10:49 PM IST
Highlights

16వ రామ్‌నాథ్ గోయెంకా అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపించే ఇంజన్ బాధ్యతాయుతమైన జర్నలిజమని అన్నారు.

నకిలీ వార్తల వ్యాప్తిపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు వర్గాల మధ్య చీలికను సృష్టిస్తాయని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే అవకాశం ఉందన్నారు. "నకిలీ వార్తలు వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టించగలవు. నిజం , అబద్ధాల మధ్య అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. నకిలీ వార్తలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు. 16వ రామ్‌నాథ్ గోయెంకా అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా  సీజేఐ చంద్రచూడ్ పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ.. దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నారు. 

క్రిమినల్ కేసుల్లో మీడియా విచారణ గురించి మాట్లాడుతూ.. కోర్టుల ముందు కూడా మీడియా నిందితుడిని దోషిగా ప్రకటిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపించే ఇంజన్ బాధ్యతాయుతమైన జర్నలిజమని అన్నారు. దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలంటే పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నారు. క్రిమినల్ కేసుల్లో మీడియా విచారణ గురించి మాట్లాడుతూ.. కోర్టులు దోషిగా నిర్ధారించడానికి ముందే మీడియా ప్రజల దృష్టిలో నిందితుడిని దోషిగా చూపిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అమాయకుల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రజలకు తెలియజేయడం మీడియా పని అని, బాధ్యతాయుతమైన జర్నలిజం సత్యాన్ని వెలుగులోకి తీసుకవస్తుందనీ, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. డిజిటల్ యుగంలో సవాళ్లను ఎదుర్కొంటున్నందున, జర్నలిస్టులు కచ్చితత్వాన్ని కాపాడుకోవాలి. , వారి రిపోర్టింగ్‌లో నిష్పాక్షికత, నిర్భయంతో ఉండాలని సూచించారు. 

'మీడియాకు స్వేచ్ఛ ఉండాలి'

పత్రికలు తమ పనిని చేయకుండా అడ్డుకుంటే.. ప్రజాస్వామ్యం చైతన్యానికి భంగం కలుగుతుందని ఉద్ఘాటించారు. కాబట్టి మీడియాకు స్వేచ్ఛ ఉండాలని, జర్నలిస్టు ప్రవర్తనతో విభేదాలు ద్వేషంగా లేదా హింసగా మారకూడదని సీజేఐ అన్నారు. చాలా మంది జర్నలిస్టులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తారు, కానీ వారి పనిలో నిర్భయంగా ఉంటారు. పౌరులుగా మనం జర్నలిస్టులు అనుసరించే ప్రక్రియతో ఏకీభవించకపోవచ్చు. నేనే కొన్ని సమయాల్లో అంగీకరించను, అయితే ఈ అసమ్మతిని ద్వేషించి హింసాత్మక రూపంలో తీసుకోలేమని అన్నారు.

'ప్రజాస్వామ్యంలో మీడియా అంతర్భాగం'

మీడియా నాల్గవ స్తంభమని, తద్వారా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు. క్రియాత్మకమైన, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం స్థాపనలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యయుత దేశంగా ఉండాలంటే.. పత్రికా స్వేచ్ఛ ఉండాలన్నారు. లీగల్ జర్నలిజం గురించి మాట్లాడుతూ.. లీగల్ జర్నలిజం పట్ల కూడా పెరుగుతున్న ఆసక్తిని చూస్తున్నామని అన్నారు. లీగల్ జర్నలిజం అనేది న్యాయ వ్యవస్థ యొక్క కథకుడు, చట్టంలోని చిక్కులపై వెలుగునిస్తుంది. అయితే, భారతదేశంలోని జర్నలిస్టులు న్యాయమూర్తుల ప్రసంగాలు, తీర్పులను సెలెక్టివ్ కోట్ చేయడం ఆందోళన కలిగించే అంశంగా మారిందని అన్నారు.  

click me!