అయోధ్యలో మారుతున్న ఆర్థిక ముఖచిత్రం..

By SumaBala Bukka  |  First Published Dec 22, 2023, 8:03 AM IST

అయోధ్యలో కొనసాగుతున్న రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా వేడుకతో పర్యాటకం వృద్ధి చెందింది. ఇది ఆర్థిక పరివర్తనలకు దారితీసింది. వివిధ ఉత్పత్తులకు, ముఖ్యంగా ఆతిథ్యం, ఆహార పరిశ్రమలకు పెరుగుతున్న డిమాండ్‌తో నగరం ఆర్థికంగా వృద్ధి చెందుతోంది. 
 


అయోధ్య : సాంస్కృతిక, చారిత్రిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది అయోధ్య. రామ జన్మభూమిలో రామ మందిర ప్రాణ్ ప్రతిష్టా వేడుక దగ్గర పడుతోంది. దీంతో పర్యాటకుత రద్దీ పెరిగింది. సందర్శకుల పెరుగుదలకు అనుగుణంగా స్థానికులకు ఎదురయ్యే సమస్యలు, వచ్చే అవకాశాలు రెండింటికీ తగిన అధిక కార్యాచరణ రూపొందింది. 

చిన్న వ్యాపారులు వృద్ధి చెందారు.. 
చిన్నవ్యాపారులకు వ్యాపారం ఆశాజనకంగా మారింది. తోపుడు బళ్లు, చేతుల మీద వస్తువులు తీసుకువచ్చి అమ్మేవాళ్లు విపరీతంగా పెరిగారు. వ్యాపారం కూడా ఆ మేరకు బాగానే జరుగుతోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ మందిర నమూనాలకు భారీ డిమాండ్ పెరిగింది. అనేక సైజుల్లో రామ మందిరం నిర్మాణ నమూనాలు అమ్ముడవుతున్నాయి. చెక్కతో సహా అనేక రకాల మెటీరియల్ తో తయారు చేసిన మోడల్స్ డిమాండ్ పెరిగింది. రామ్ దర్బార్, రామ్ నామి పెన్నులు,  డైరీలు వంటి ఇతర సంబంధిత వస్తువులతో పాటు 8, 10-అంగుళాల పరిమాణాలలో మోడల్‌లకు అత్యధిక డిమాండ్ ఉంది.

Latest Videos

undefined

అయోధ్య రాములోరి పూజారిగా తిరుపతి వేద విద్యాలయం విద్యార్థి...

భక్తులు, పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ, అయోధ్య వీధుల్లో దండలు, బొమ్మలు, జెండాలు, మతపరమైన చిహ్నాలు, మేకప్ వస్తువులను విక్రయించే వ్యక్తులు పెరుగుతున్నారు. ఒకప్పుడు శృంగార్ హాట్ వంటి నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమైన రద్దీ ఇప్పుడు వివిధ ప్రదేశాలకు విస్తరిస్తోంది. సందర్శకుల పెరుగుదలతో అయోధ్య ఆర్థిక ముఖ చిత్రం మారిపోతోంది. పర్యాటకుల సంఖ్య  పెరగడంతో ఆతిథ్య రంగమూ పెరిగింది. 
 

click me!