విక్రమ్ ల్యాండర్ పై ఇంకా ఆశలు ఉన్నాయి.. ఇస్రో

By telugu teamFirst Published Oct 2, 2019, 7:44 AM IST
Highlights

14 రోజులపాటు సాగే ఈ దశ వల్ల వ్యోమనౌకకు సౌరశక్తి లభిస్తుందని చెప్పారు. మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక కమ్యూనికేషన్ సంబంధాల పునరుద్ధరణ కసరత్తు ప్రారంభిస్తామని చెప్పారు.

చంద్రుడి ఉపరితలంపై ఉన్న విక్రమ్ ల్యాండర్ తో సంబంధాలు పునరుద్ధరించేందకు తమ ప్రయత్నాలు ఆపడం లేదని ఇస్రో సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాత్రి సమయం కావడంతో 10 రోజుల కిందట తమ ప్రయత్నాలకు విరామం ఇచ్చామని చెప్పారు. 14 రోజులపాటు సాగే ఈ దశ వల్ల వ్యోమనౌకకు సౌరశక్తి లభిస్తుందని చెప్పారు. మళ్లీ పగటి సమయం ఆరంభమయ్యాక కమ్యూనికేషన్ సంబంధాల పునరుద్ధరణ కసరత్తు ప్రారంభిస్తామని చెప్పారు.

కాగా.... విక్రమ్ ల్యాండర్ ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలి పోయింది. ఈ విషయాన్ని నాసా అధికారికంగా ప్రకటించింది. హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు నాసా ప్రకటించింది. ఎర్త్ స్టేషన్ తో సంబంధాలు తెగిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు నాసా గుర్తించింది.

కాగా... విక్రమ్ జాడ ఇప్పటికీ గుర్తించలేకపోయామని నాసా తెలిపింది. ఈ మేరకు నాసా తన అధికారిక ట్విట్టర్ లో పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా నాసా ట్వీట్ లో పేర్కొంది. 

జులై 22వ తేదీన చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకువెళ్లింది.  ఆ తర్వాత ఒక్కో దశ విజయవంతంగా పూర్తి చేసుకుంటూ చంద్రుడి ఉపరిత కక్ష్యలోకి చేరింది. అనంతరం ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ చంద్రుడిపై దిగడానికి 2.1 కిలోమీటర్ల దూరం ఉండగా భూ కేంద్రంతో దానికి సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ల్యాండర్ తో సంకేతాలను పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కాగా... ఇస్రోకి సపోర్ట్ చేయడానికి నాసా కూడా ముందుకు వచ్చింది. ఈ క్రమంలో నాసా జరిపిన పరిశోధనలో ఈ విక్రమ్ ల్యాండర్ కూలిపోయినట్లు తేలింది. 

click me!