జైట్లీ మృతి... నెల్లూరు పర్యటన రద్దు చేసుకున్న వెంకయ్య నాయుడు

By telugu teamFirst Published Aug 24, 2019, 2:13 PM IST
Highlights

చెన్నై విమానాశ్రయంలో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. అరుణ్ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని.. అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటు అని చెప్పారు. జైట్లీ ఓ ఉత్తమ పార్లమెంటేరియన్, న్యాయ కోవిదుడు అంటూ కొనియాడారు.
 

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య ఉన్నపళంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చెన్నై నుంచి వెంకయ్య ఈ రోజు నెల్లూరుకి రావాల్సి ఉంది. కాగా.. జైట్లీ మరణ వార్త వినాల్సి రావడంతో.. తన నెల్లూరు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఉన్నపళంగా చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరారు.   శనివారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అరుణ్ జైట్లీ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

కాగా చెన్నై విమానాశ్రయంలో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. అరుణ్ జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని.. అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. జైట్లీ మృతి దేశానికి, వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటు అని చెప్పారు. జైట్లీ ఓ ఉత్తమ పార్లమెంటేరియన్, న్యాయ కోవిదుడు అంటూ కొనియాడారు.

జీఎస్టీ తీసుకురావడంలో జైట్లీ కీలక పాత్ర పోషించారని, పన్ను విధానంలో  సమూల మార్పులకు ఆయన కృషి చేశారని ఈ సందర్బంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

కాగా.. అరుణ్ జైట్లీ మృతిపట్ల ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలియజేశారు. జైట్లీ ఆత్మకు శాంతి చూకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జైట్లీ కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

click me!