ఇంట్లో సోదాలు: అధికారులతో గొడవకు దిగిన గాలి అత్త

By pratap reddyFirst Published Nov 9, 2018, 7:50 AM IST
Highlights

ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని గాలి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

బెంగళూరు: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సమయంలో హై డ్రామా చోటు చేసుకుంది. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి రూ.600 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన అంబిడెంట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి కాపాడేందుకు రూ.18 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని గాలి జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. 

ఈ ఆరోపణల నేపథ్యంలో సిసిబి అధికారులు గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం 6 గంటలకే అధికారులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇంట్లో గాలి జనార్దన్ రెడ్డి భార్య లక్ష్మి అరుణ ఉన్నారు. ఆమె తండ్రి పరమేశ్వర్ రెడ్డి, తల్లి నాగలక్ష్మమ్మ కూడా ఇంట్లో ఉన్నారు. 

సిసిబి అధికారులు వచ్చారని తెలిసిన వెంటనే బిజెపి ఎమ్మెల్యే, గాలి జనార్దన్ రెడ్డి సన్నిహిత మిత్రుడు బి శ్రీరాములు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. 

అయితే, సిసిబి అధికారులు గాలి జనార్దన్ రెడ్డి అత్త నాగలక్ష్మమ్మ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కున్నారు. పండుగ పూట ఈ సోదాలేమిటంటూ ఆమె గొడవకు దిగారు. సమాచారం ఇవ్వకుండా సోదాలు నిర్వహించడాన్ని శ్రీరాములు తప్పు పట్టారు. 

సంబంధిత వార్తలు

పరారీలో గాలి జనార్దన్ రెడ్డి: బయటపడిన షాకింగ్ విషయాలు

పోలీసు వేట: గాలి జనార్దన్ రెడ్డి హైదరాబాదులో ఉన్నారా...

అంబిడెంట్ కంపెనీతో డీల్: పరారీలో గాలి జనార్ధన్ రెడ్డి

పరారీలో గాలి జనార్థన్ రెడ్డి...ఎమ్మెల్యే శ్రీరాములు ఏమన్నారంటే

click me!