యూట్యూబ్‌ చూసి బ్యాంకులో దోపీడీ: అప్పు తీర్చలేక లోన్ ఇచ్చిన బ్యాంకులకే కన్నం

By narsimha lodeFirst Published Oct 6, 2020, 1:45 PM IST
Highlights

లాక్ డౌన్ సమయంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు గాను ఓ బట్టల వ్యాపారి రెండు బ్యాంకుల నుండి రూ. 12 లక్షలు దోచుకొన్నాడు. చివరికి  పోలీసులకు చిక్కాడు. యూట్యూబ్ ద్వారా దొంగతనం చేయడం నేర్చుకొన్నాడు.


భువనేశ్వర్: లాక్ డౌన్ సమయంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు గాను ఓ బట్టల వ్యాపారి రెండు బ్యాంకుల నుండి రూ. 12 లక్షలు దోచుకొన్నాడు. చివరికి  పోలీసులకు చిక్కాడు. యూట్యూబ్ ద్వారా దొంగతనం చేయడం నేర్చుకొన్నాడు.

భువనేశ్వర్ కు సమీపంలోని తంగిబంటకు చెందిన సౌమ్యరంజన్ జీనా రెడీమెడ్ బట్టల వ్యాపారం నిర్వహించేవాడు.  ఆయన వయస్సు 25 ఏళ్లు.  లాక్ డౌన్ ముందు వరకు ఆయన వ్యాపారం బాగా నడిచేది.

వ్యాపారం కోసం ఆయన బ్యాంకుల నుండి రుణం తీసుకొన్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఆయనకు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. బ్యాంకు ఈఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకు వాయిదాలు చెల్లించడానికి గాను బ్యాంకులను దోపీడీ చేయాలని .ఆయన నిర్ణయం తీసుకొన్నాడు.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన చోరీ చేశాడు. బరీముండాలోని బ్యాంకు ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో సెప్టెంబర్ 28వ తేదీన చోరీకి పాల్పడ్డాడు.బొమ్మ తుపాకీ సహాయంతో ఈ రెండు బ్యాంకులను నిందితుడు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.నిందితుడి నుండి రూ. 10 లక్షలను పోలీసులు రికవరీ చేసుకొన్నారు. జీనా ఉపయోగించిన వాహనం, బొమ్మ తుపాకీని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

బ్యాంకులో అతి తక్కువ మంది సిబ్బంది ఉన్న సమయాన్ని చూసుకొని సౌమ్యరంజన్ జీనా బ్యాంకులోకి హెల్మెట్ పెట్టుకొని వెళ్లి నగదును ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. బొమ్మ తుపాకీని చూపి బెదిరించేవాడు.

చోరీ చేసిన రెండు బ్యాంకుల నుండి  జీనా రూ. 19 లక్షలను లోన్ గా తీసుకొన్నాడు. ఇప్పటికే రూ. 6 లక్షలను ఆయా బ్యాంకులకు చెల్లించాడు.

చోరీ చేసిన బ్యాంకులోనే చోరీ చేసిన నగదులో నుండి రూ. 60 వేలు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన సమయంలో బ్యాంకు సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతి తక్కువ నగదును జమ చేస్తే ఎవరికీ అనుమానం రాదని భావించి ఆయన వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది.


 

click me!