Bulli Bai: ఆన్‌లైన్ లో అమ్మ‌కానికి అమ్మాయిలు.. యాప్‌లో ఓ వ‌ర్గం వారి ఫొటోలు.. సర్వత్రా ఆగ్రహం !

By Mahesh RajamoniFirst Published Jan 2, 2022, 12:49 PM IST
Highlights

 Bulli Bai: ఆన్‌లైన్ లో అమ్మాయిల‌ను అమ్మ‌కానికి పెడుతున్నారు. ఒక వ‌ర్గానికి చెందిన అమ్మాయిల‌ ఫొటులు అప్‌లోడ్ చేసి వేలానికి పెడుతూ.. వికృత చేష్ట‌లు పాల్ప‌డుతున్నారు. ఈ యాప్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్రానికి ఫిర్యాదులు అంద‌డంతో ఈ కంప‌రం పుట్టించే ప‌నుల‌కు పాల్ప‌డుతున్న   "బుల్లిబాయ్" పై చ‌ర్య‌లు తీసుకోవ‌డాకినికి ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. 

 Bulli Bai: కాలంతో ప‌రుగులు పెడుతూ సాంకేతిక రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌చ్చాయి. కొత్త‌గా వ‌చ్చిన టెక్నాల‌జీ మానవ జీవితాన్ని మ‌రింత సుఖ‌మ‌యం చేసింది. అయితే, అందివచ్చిన సాంకేతికతను అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి..  కొంద‌రు దానిని దుర్వినియోగానికి వినియెగిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే దారణాల‌కు ఒడిగ‌డుతున్నారు. స‌మాజిక మాధ్య‌మాల్లో  అయితే పోకిరీల చ‌ర్య‌ల‌కు అడ్డుఅదుపు లేకుండా పోతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు దుండ‌గులు అమ్మాయిల‌ను ఆన్‌లైన్ లో వేలానికి పెట్టారు. మ‌రీ ముఖ్యంగా ఒక వ‌ర్గం వారిని టార్గెట్ చేసి మ‌రీ.. అమ్మాయి ఫొటోల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి.. వేలం నిర్వహిస్తున్నారు. దీనికి కోసం ప్ర‌త్యేకంగా ఓ యాప్ నే సృష్టించారు. అదే "బుల్లిబాయ్". ఇటీవ‌ల ఈ యాప్, అమ్మాయిల‌ను వేలం వేయ‌డం గురించి  ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించ‌డంతో వైరల్ అయింది. దీనిపై నెటిజ‌న్ల‌తో పాటు ప్ర‌జ‌లంద‌రి నుంచి ఆగ్ర‌హం వ్య‌క్తమైంది. ‘బుల్లీ బాయ్‌’ పేరిట యాప్‌ను సృష్టించి వికృత చేష్ట‌ల‌కు పాల్ప‌డుతున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. వీటితో పాటు మ‌రిన్ని క్లోన్ యాప్‌లు కూడా ఉన్నాయి. బుల్లి బాయి, సిల్లీ డీల్స్ పేరుతో  వాటిల్లో వందల సంఖ్యలో ఓ వ‌ర్గానికి చెందిన అమ్మాయిలు, మహిళల ఫొటోలు అప్‌లోడ్ అయ్యాయి.

Also Read: up assembly elections 2022: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: టైమ్స్ నౌ పోల్

ఒక వ‌ర్గానికి చెందిన అమ్మాయిల ఫొటోల‌ను బుల్లిబాయ్ యాప్ లో అప్‌లోడ్ చేసి.. వేలం నిర్వ‌హిస్తున్న  వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్ర‌స్తుతం  ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు తెర‌దీసింది. కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి ఈ విధ‌మైన చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. వారిపై వెంట‌నే  కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

Also Read: coronavirus:యూర‌ప్ పై క‌రోనా విజృంభ‌ణ‌.. 100 మిలియ‌న్ల‌కు పైగా కేసులు 

ఆయా యాప్‌ల‌లో ప‌లువురు ప్ర‌ముఖుల ఫొటోలు కూడా ఉన్నాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో కూడా వీటిపై కేసు న‌మోదైంది. త‌న ఫొటోను కూడా దుండగులు యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఓ మహిళా జర్నలిస్టు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిపై మూడు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఇటు ముంబయితో పాటు దిల్లీ పోలీసులు స్పందించారు. తమకు అందిన ఫిర్యాదులపై విచారణ ప్రారంభించామని తెలిపారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని శనివారం నాటి రాత్రి ఈ ఫొటోలు విస్తృతంగా సర్క్యూలేట్  అయ్యాయి. ఈ విష‌యం కేంద్రం దృష్టికి వెళ్ల‌డంతో.. చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైంది. కేంద్రం మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై స్పందిస్తూ.. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్ తో పాటు మ‌రికొన్ని ఇదే త‌ర‌హా యాప్ ల‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసులు సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని వెల్ల‌డించారు. ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన ‘గిట్‌హబ్‌’ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు.

Also Read: Omicron:27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్త‌గా ఎన్నంటే?

 

Sir,Thank you.With due respect I had shared with you that besides blocking the platform punishing the offenders creating such sites is important.I hope & will support to find these culprits&make them as well as platforms accountable https://t.co/o1wXAnJVYq

— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19)
click me!