
అహ్మదాబాద్: తల్లిదండ్రులు(Parents).. పిల్లల(Children)పై శ్రద్ధ వహించాలి. ఒక్క క్షణం కూడా వారిని అలక్ష్య పెట్టవద్దు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా వారి ప్రాణాలు తీయవచ్చు. సాధారణంగానే తల్లిదండ్రులు.. ఎప్పుడూ పిల్లలను కనిపెట్టుకుని ఉంటుంటారు. అయినా.. వారి నుంచి తప్పించుకుని పిల్లలు ఆటలాడుతూ ఉంటారు. ఒక్కోసారి.. ఆ ఆటలు కూడా పిల్లల ప్రాణాలు పోవడానికి కారణాలు కావొచ్చు. గుజరాత్‌లో ఇలాంటి ఘటనే ఒకటి ముందుకు వచ్చింది.
గుజరాత్(Gujarat)లోని సూరత్‌లో దారుణం జరిగింది. ఐదు అంతస్తుల బిల్డింగ్ ఎక్కి టెర్రస్‌పై నుంచి గాలి పటం(Kite) ఎగరేస్తూ.. ఓ ఆరేళ్ల చిన్నారి కాలు జారి కిందపడిపోయాడు. ఆరు అంతస్తుల నుంచి అమాంతం నేలపై పడిపోయాడు. స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలుడిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు వెంటనే ఆయనకు చికిత్స అందించడం ప్రారంభించారు. కానీ, ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించాడు. ఈ ఘటనతో వారు నివసిస్తున్న ఏరియా మొత్తం విషాదంలో మునిగింది.
Also Read: Hanmakonda Crime: న్యూఇయర్ పార్టీలో అపశృతి... క్వారీ గుంతలో శవాలుగా తేలిన యువకులు
హరన్ పటేల్ నవసారి వ్యవసాయ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఇల్లు చూసుకుంటుంది. వీరిద్దరికి తనయ్ పటేల్ అనే పిల్లాడు పుట్టాడు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు. ఆ పిల్లాడు చాలా చలాకీగా పనులు చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ఉండేవాడు. కానీ, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆ పిల్లాడిని కనిపెడుతూనే ఉండేవారు. కానీ, గురువారం ఒకటో తరగతి చదువుతున్న ఆ తనయ్ పటేల్ తల్లిదండ్రుల నుంచి తప్పించుకుని పిల్లలతో కలిసి ఐదు అంతస్తుల బిల్డింగ్ ఎక్కి టెర్రస్ మీదకు చేరారు. అక్కడ గాలిపటం ఎగరేస్తూ కేరింతలు కొట్టారు. కానీ, గాలి పటాన్ని హుషారుగా ఎగరేస్తూ వెనక్కి నడిచాడు. ఆ బిల్డింగ్ ఎంత వైశాల్యం ఉన్నది మరచి.. గాలి పంటంపైనే ఫోకస్ పెట్టి వెనక్కి నడవడంతో ఆయన కాలు జారింది. బిల్డింగ్ చివరకు రావడంతో కిందపడిపోయాడు. ఐదు అంతస్తుల నుంచి నేరుగా నేలపై వచ్చి పడిపోయాడు. ఈ ఘటన ఆ ప్రాంతాన్ని కలచి వేసింది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఆప్తులూ తీవ్ర కలతో మునిగిపోయారు.
Also Read: పదేళ్ల బాలుడి ప్రాణాలు తీసిన పతంగి.. పేడకుప్పలో పడి, ఊపిరాడక...
తల్లిదండ్రులకు తెలియకుండానే తనయ్ పటేల్ ఇంకొందరు పిల్లలతో కలిసి టెర్రస్ మీదకు వెళ్లినట్టు తమ ప్రాథమిక విచారణలో పోలీసులు తెలిపారు. ఈ ఘటనను పోలీసులు విచారణ చేపడుతున్నారు. గుజరాత్‌లో ప్రతి ఏడాది గాలి పటం ఉత్సవాల్లో ఏదో ఒక విషాదం చోటుచేసుకుంటూనే ఉన్నది. గాలి పటం ఎగరేస్తూ ఇది వరకు చాలా సార్లు ఇలాంటి దుర్ఘటనలు జరిగాయి. అంతేకాదు, గాలి పటాలకు వినియోగించే మాంఝా కారణంగానూ చాలా మంది గాయపడ్డారు. ఇప్పటికీ గాయపడుతూనే ఉన్నారు. కాబట్టి, పిల్లలంతా ఉత్సాహంగా పాలుపంచుకునే ఈ ఆటల్లో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. న్యూ ఇయర్‌కు ఒక రోజు ముందే ఈ ఘటన చోటుచేసుకుంది.