
యూపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్రం పొలిటికల్ హీట్ మొదలయ్యింది. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ, బీజేపీలు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ సారి యూపీలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆ పార్టీ యూపీ ఎన్నికల ప్రచారం కూడా పెట్టింది. రాష్ట్రం అంతటా ఆ పార్టీ నాయకులు రోజ్ గార్ గ్యారంటీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు లక్నో పట్టణంలోని స్మృతి ఉప్వాన్ మైదాన్‌లో జరిగే సభలో పాల్గొననున్నారు.
ఈ ర్యాలీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకులు ఉత్తరప్రదేశ్ అంతటా పర్యటించారు. ఈ సందర్భంగా యూపీ ప్రజలకు అనేక హామీలు ప్రకటించారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలు చేశారు. ప్రజల నుండి మద్దతు లేఖలను కూడా స్వీకరించారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గురువారం ఉదయం పునరుద్ఘాంటిచారు. ప్రతి సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.5,000 భృతిని ఇస్తామని తెలిపారు.
తల్లిదండ్రులూ.. పిల్లలపై శ్రద్ధ వహించండి..! గాలిపటం ఎగరేస్తూ ఆరేళ్ల బాలుడు దుర్మరణం
ఫిబ్రవరి చివర్లో ఎన్నికలు..
యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్యలో ఎన్నికలు జరగున్నాయి. యూపీలో మొత్తం 403 మంది శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు అనుకున్న సమయంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని వినతులు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ ప్రకటన విడుదల చేసింది. అయితే ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికార పార్టీగా ఉంది. అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రతిపక్షంగా ఉంది.
యూపీ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 312 గెలుచుకుంది. రూలింగ్ పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కేవలం 47 సీట్లతో సరిపెట్టుకుంది. బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ 19 స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. మిగిలిన స్థానాలను ఇతర పార్టీల సభ్యులు, స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంతో ఆ పార్టీ సొంతగానే అధికారం ఏర్పాటు చేసింది. సీఎంగా యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా బాధ్యతలు స్వీకరించారు. యూపీలో ప్రభుత్వ పదవీకాలం 14 మే 2022తో ముగియనుంది.
యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం: టైమ్స్ నౌ పోల్
తొలిసారి అదృష్టం పరీక్షించుకోనున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ రెండో సారి అధికారం చేపట్టిన జోష్‌లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ యూపీలో తొలిసారి తన అదృష్టం పరీక్షించుకోనుంది. 2020లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో పోటీ చేయనుంది. పంజాబ్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఆప్ అడుగులేస్తోంది.