హైజాకైన షిప్ ను కాపాడినందుకు గాను బల్గేరియా అధ్యక్షుడు భారత్ కు ధన్యవాదాలు తెలిపారు.
న్యూఢిల్లీ: బల్గేరియా అధ్యక్షుడు రుమెన్ రాదేవ్ సోమవారం నాడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.హైజాక్ చేసిన ఎంవీ రుయెన్ అనే కార్గో షిప్ ను భారత నావికా దళం కాపాడింది.
My sincere gratitude to PM for the brave action of 🇮🇳Navy rescuing the hijacked Bulgarian ship “Ruen” and its crew, including 7 Bulgarian citizens.
— President.bg (@PresidentOfBg)
శుక్రవారం నాడు అరేబియా సముద్రంలో భారత నౌకాదళం రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించింది.ఈ మేరకు సోషల్ మీడియాలో బల్గేరియా అధ్యక్షుడు రాదేవ్ సోషల్ మీడియాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. హైజాక్ చేసిన నౌకలో ఏడుగురు బల్గేరియన్ పౌరులతో పాటు సిబ్బంది ఉన్నారు.ఈ నౌకను భారత నావికాదళం రక్షించిన విషయం తెలిసిందే.
తమ నౌకను హైజాకర్ల నుండి రక్షించినందుకు గాను బల్గేరియా విదేశాంగ మంత్రి మారియా గాబ్రియేల్ కూడ భారత్ కు ధన్యవాదాలు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ను విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో గాబ్రియేల్ చేసిన పోస్టుకు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పందించారు.