మహారాష్ట్ర గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: నలుగురు మావోయిస్టుల మృతి

Published : Mar 19, 2024, 09:29 AM IST
మహారాష్ట్ర గడ్చిరోలిలో ఎదురుకాల్పులు: నలుగురు మావోయిస్టుల మృతి

సారాంశం

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇవాళ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

ముంబై:మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మంగళవారం నాడు జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతంలో  పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. మృతులపై  రూ. 36 లక్షల రివార్డు ఉంది.ఘటన స్థలం నుండి  ఎ.కె. 47, కార్బైన్, రెండు ఫిస్టల్ తో పాటు పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మృతులను వర్గీస్, మంగాతు, రాజు, వెంకటేష్ గా గుర్తించారు.తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు మావోయిస్టులు ప్రాణహిత నది గుండా గడ్చిరోలి ప్రాంతానికి చేరుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?