బ్రహ్మోస్ మిస్సైల్ ను పాక్ కాదు చైనా కూడా అడ్డుకోలేదు : అమెరికా రక్షణరంగ నిపుణుడు

Arun Kumar P   | ANI
Published : May 20, 2025, 11:18 AM IST
BrahMos Production Unit 7

సారాంశం

భారతదేశం యొక్క బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి యొక్క  శక్తిసామర్థ్యాల గురించి రక్షణరంగ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈ మిస్సైల్ ను పాకిస్థాన్ కాదు చైనా కూడా అడ్డుకోలేదని పాక్ రక్షణ నిపుణుడి కామెంట్స్ ను గుర్తుచేసారు.  

BrahMos Missile : భారతదేశం వద్దగల బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి అసమానమైన శక్తిని కలిగివుంది రక్షణ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఈ క్షిపణి సామర్థ్యాలు చైనా యొక్క అధునాతన వాయు రక్షణ వ్యవస్థలను కూడా మించిపోయాయని అమెరికా రక్షణ నిపుణుడు జాన్ స్పెన్సర్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా శ్రీవాస్తవ గుర్తుచేసారు.

"భారతదేశం యొక్క బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణి చాలా అధునాతనమైనది… చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్  కూడా దానిని అడ్డుకోలేకపోయాయని అని ఇటీవల అమెరికా రక్షణ నిపుణుడు జాన్ స్పెన్సర్ పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై భారత్ జరిపిన ఆపరేషన్లలో చైనాకు చెందిన HQ-9B వాయు రక్షణ వ్యవస్థ వైఫల్యం బయటపడిందని గుర్తుచేసాడు. ఇది రక్షణ పరంగా భారత శక్తిని హైలైట్ చేస్తుందని ఆయన గుర్తించారు. బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించి భారతదేశం విజయవంతంగా ప్రతీకార దాడులు చేయడం ద్వారా వాటి ప్రభావాన్ని ప్రదర్శించిందని, ఈ ఆయుధం  ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగించిందని స్పెన్సర్ జోడించారు. బ్రహ్మోస్ క్షిపణిపై భారతదేశం-రష్యా సహకారం ఒక ప్రధాన విజయంగా నిరూపించబడింది, ఈ వ్యవస్థ ఇప్పుడు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతోంది" అని అమెరికా రక్షణ నిపుణుడు అన్నట్లుగా శ్రీవాస్తవ తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించింది భారత్. ఈ క్రమంలోనే పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థలాలపై దాడి చేసింది. ఈ సమయంలో బ్రహ్మోన్ మిస్సైల్స్ ఉపయోగించారు.

బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ రక్షణ దౌత్యంలో భారతదేశం యొక్క స్థానాన్ని పటిష్టం చేసింది. క్రూయిజ్ క్షిపణి భూమి, సముద్రం, ఆకాశ లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులను అనుమతిస్తుంది. దాని సూపర్‌సోనిక్ వేగం మరియు రేంజ్ భారతదేశం రక్షణరంగంలో ఎంత పటిష్టంగా మారిందో తెలియజేస్తుంది.  

బ్రహ్మోస్ ఆకట్టుకునే సామర్థ్యాలను కలిగి ఉంది. సూపర్‌సోనిక్ వేగాలను చేరుకోవడం, మాక్ 3కి దగ్గరగా ప్రయాణించడం, భూమి, గాలి, నౌకలు మరియు జలాంతర్గాముల నుండి ప్రయోగించవచ్చే అవకాశం కలిగివుంది. 290 కి.మీ.ల ప్రారంభ పరిధి, 800 కి.మీ.ల వరకు వెర్షన్‌లు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఖచ్చితమైన లక్ష్యం కోసం అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగిస్తున్నారు.

బ్రహ్మోస్ మిస్సైల్ ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. బ్రహ్మోస్-ER వంటివాటిని రేంజ్ పెంచి సుదూర లక్ష్యాలను చేధించేలా తయారుచేసారు. మాక్ 7-8 వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్-II అభివృద్ధిలో ఉంది… అలాగే మెరుగైన సామర్థ్యాల కోసం తగ్గిన పరిమాణం మరియు రాడార్ క్రాస్-సెక్షన్‌తో బ్రహ్మోస్-NG అభివృద్ధి చేయబడుతోంది.

 ఈ క్రమంలో "భారతదేశంలోని ఈ ప్రభుత్వంపై పాశ్చాత్య దేశాల ప్రభావం లేదా ఒత్తిడిలో పనిచేయదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలు రష్యాతో ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించుకోవాలని భారతదేశాన్ని ఒప్పించడానికి ప్రయత్నించాయి. అయితే భారతదేశం దృఢంగా నిలిచి దాని స్వతంత్ర వైఖరిని కొనసాగించింది. భారతదేశం యొక్క దౌత్యపరమైన నిర్ణయాలు మరియు రక్షణ వ్యూహాలు జాతీయ ప్రయోజనాల ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి'' అని రక్షణ రంగ నిపుణులు  అని రక్షణ నిపుణుడు సంజీవ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే
Modi Putin Meeting: మోదీ, పుతిన్ భేటీతో మనకు జరిగేదేంటీ.? రష్యా ప్రపంచానికి ఏం చెప్పాలనుకుంది.?