బీజేపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించదు..అదంతా జిమ్మిక్కు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

Published : Feb 23, 2023, 02:27 PM IST
బీజేపీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించదు..అదంతా జిమ్మిక్కు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా

సారాంశం

జమ్మూ కాశ్మీర్ కు బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్దరించదని, అదంతా జిమ్మిక్కు అని లోక్ సభ ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆ పార్టీ నాయకులు ప్రపంచాన్ని మోసం చేయాలని అనుకుంటున్నారని తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్ కు బీజేపీ రాష్ట్ర హోదాను పునరుద్దరించదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించిన వారం తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో బుధవారం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ‘‘వారు రాష్ట్ర హోదాను పునరుద్ధరించలేరు. ఇదంతా జిమ్మిక్కు’’ అని అన్నారు.

పునరుత్పాదక రంగంలో భారత్ సామర్థ్యం గోల్డ్ మైన్ కంటే తక్కువేమీ కాదు - ప్రధాని నరేంద్ర మోడీ

‘‘వారు మనల్ని, ప్రపంచం మొత్తాన్ని మోసం చేయాలనుకుంటున్నారు. వారు దానిని (హోదాను) పునరుద్ధరించరు. వారి ఆదేశాలను నిశ్శబ్దంగా గమనిస్తున్నాం’’ అని ఆయన  అన్నారు. ‘‘బానిస జాతి ఏం చేయగలదు ? మనం ఏం చేయగలం ? ఈ దృశ్యాన్ని చూస్తున్నాం’’ అని అబ్దుల్లా పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, డీలిమిటేషన్ చేశామని భారత ప్రభుత్వం చెబుతుంటే ఇక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడానికి కారణమేంటని ఎన్సీ అధ్యక్షుడు ప్రశ్నించారు.

నేను కూడా బీఫ్ తింటా.. రాష్ట్రంలో గొడ్డు మాంసంపై ఆంక్షలేమీ లేవు: మేఘాలయ బీజేపీ చీఫ్ సంచలన ప్రకటన

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే జమ్ముకశ్మీర్ లో ఎందుకు నిర్వహించడం లేదని అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ను ఇక్కడ ఎందుకు నియమించారని, ఆయనే అన్నింటికీ అధిపతి అయ్యారని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అందరూ దాని ఈ విషయాన్ని ఆలోచించాలని అన్నారు.

ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేయడం, 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ రాష్ట్ర విభజన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని పార్లమెంటులో ప్రకటించారు. అలాగే ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యూటీలో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తి కావస్తోందని, ఎన్నికలపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అమిత్ షా అన్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ నోటీసులు

2018 జూన్ మధ్యలో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ కేంద్రం పాలనలో ఉంది. 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత, జమ్మూ కాశ్మీర్ యూటీ లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తున్నారు. దీంతో ఇది కేంద్రం ప్రత్యక్ష నియంత్రణలో ఉంది.
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం