హత్య కేసులో మంత్రి కొడుక్కి యావజ్జీవ కారాగార శిక్ష

By Nagaraju penumalaFirst Published Jun 6, 2019, 9:39 AM IST
Highlights

దీంతో రెచ్చిపోయిన మంత్రిగారి తనయుడు బగ్రా కంసిని కాల్చి చంపాడు. ఈ ఘటన 2017 మార్చి 26న చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కంసిని బగ్రా కాల్చి చంపారనే అభియోగాలను పోలీసులు రుజువు చేయడంతో మంత్రి తనయుడు బగ్రాకు జీవిత ఖైదు విధించింది ఇటానగర్ కోర్టు. 

అరుణాచల్ ప్రదేశ్: ఓ కాంట్రాక్టు విషయంపై గొడవ రావడంతో ఆవేశంలో అవతలి వ్యక్తిని కాల్చి చంపేశాడు అరుణాచల్‌ ప్రదేశ్‌ పరిశ్రమల శాఖ మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్‌ బగ్రా. ఈ హత్యకేసులో మంత్రి తనయుడు కజుమ్ బగ్రాకు కోర్టు జీవిత ఖైదు విధించింది. 

వివరాల్లోకి వెళ్తే వెస్ట్‌ సియాంగ్‌ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్‌ వద్ద రెండేళ్ల క్రితం మంత్రి తనయుడు కజుమ్ బగ్రా  కెంజుం కంసి అనే వ్యక్తితో కాంట్రాక్ట్ విషయంపై చర్చించారు. చర్చలు కాస్త వివాదానికి దారి తీశాయి. 

దీంతో రెచ్చిపోయిన మంత్రిగారి తనయుడు బగ్రా కంసిని కాల్చి చంపాడు. ఈ ఘటన 2017 మార్చి 26న చోటు చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కంసిని బగ్రా కాల్చి చంపారనే అభియోగాలను పోలీసులు రుజువు చేయడంతో మంత్రి తనయుడు బగ్రాకు జీవిత ఖైదు విధించింది ఇటానగర్ కోర్టు. 

హోటల్‌ వెలుపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డు కావడంతో మంత్రి కుమారుడి నేరం కెమెరాలో రికార్డు అయ్యిందని పోలీసులు స్పష్టం చేశారు. ఆ సాక్ష్యం కేసులో ప్రధాన ఆధారంగా నిలిచిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే బగ్రా కంసిని హత్య చేసిన సమయంలో ఆయన తండ్రి అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేస్తున్నారు. 

click me!