రంజాన్ పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 'సౌగత్ ఏ మోదీ' పేరుతో మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రంజాన్ పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 'సౌగత్ ఏ మోదీ' పేరుతో మంగళవారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈద్ పండుగను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా 32 లక్షల మంది నిరుపేద ముస్లింలకు ప్రత్యేక బహుమతులు అందిస్తున్నారు. బీజేపీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన 'సౌగత్-ఏ-మోదీ' కార్యక్రమంలో భాగంగా ఈద్ కానుకలను పంపిణీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.ఈ కార్యక్రమాన్ని మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 32,000 మసీదుల్లో 32,000 బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, నిరుపేద ముస్లింలకు 'సౌగత్-ఏ-మోదీ' కిట్లను అందజేస్తారు.
ఈ ప్రత్యేక బహుమతిలో పలు నిత్యావసర వస్తువులు ఉంటాయి. పచ్చిమిర్చి, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, చక్కెర వంటి ఆహార పదార్థాలతో పాటు ముస్లిం మహిళలు, పురుషులకు కొత్త దుస్తులు అందిస్తారు. ఒక్కో కిట్ ధర సుమారు రూ. 500 నుంచి రూ. 600 వరకు ఉంటుంది.
| Delhi | BJP Minority Morcha distributes 'Saugat-e-Modi' kits to poor Muslims.
National President of BJP Minority Morcha, Jamal Siddiqui says, "PM Narendra Modi participates in the celebrations of every festival and in the happiness of everyone. We are making efforts to… pic.twitter.com/aTZKUJquAp
ఈ కార్యక్రమం గురించి బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ మాట్లాడుతూ.. 'సౌగత్-ఏ-మోదీ' ముస్లింల సంక్షేమానికి చేపట్టిన ఒక విశిష్ట కార్యక్రమమని అన్నారు. ఇది పేద ముస్లిం కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈద్‌ను ఆనందంగా జరుపుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ప్రచారం కేవలం ఈద్ మాత్రమే కాకుండా గుడ్ ఫ్రైడే, ఈస్టర్, నవ్రోజ్ వంటి పండుగల్లోనూ కొనసాగుతుందని బీజేపీ మైనారిటీ మోర్చా ప్రకటించింది.
మైనారిటీ మోర్చా జాతీయ మీడియా ఇన్‌చార్జి యాసిర్ జిలానీ మాట్లాడుతూ, 'సౌగత్-ఏ-మోదీ' పథకం ముస్లిం సమాజంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు బీజేపీ, ఎన్డీఏలకు రాజకీయ మద్దతును పెంచడానికీ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలో ఈద్ మిలాన్ వేడుకలు కూడా నిర్వహించనున్నారు. దీనిద్వారా స్థానికంగా ముస్లింలతో సంబంధాలను మరింత బలపరచాలని బీజేపీ యోచిస్తోంది. ఈ కార్యక్రమంతో పేద ముస్లింలకు అండగా నిలవాలనే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.