Stampede: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా.. బెంగళూరు తొక్కిసలాటపై సీఎం సిద్ధరామయ్య ఏమన్నారంటే?

Published : Jun 04, 2025, 08:57 PM IST
Bengaluru stampede: CM Siddaramaiah Announces Rs 10 Lakh Aid

సారాంశం

Bengaluru stampede: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ గెలుపు వేడుక క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరగింది. 11 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు సీఎం సిద్ధరామయ్య రూ.10 లక్షల సాయం ప్రకటించారు.

Bengaluru stampede: ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ జట్టు విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం దగ్గర తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన జనంతో పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయారు. ఈ ఘటనపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన జరగాల్సింది కాదని అన్నారు.  మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  అలాగే, గాయపడ్డవారికి ఉచిత మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు.

బెంగళూరు తొక్కిసలాట ఎలా జరిగింది? 

ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్ లో తమ మొదటి టైటిల్ ను సాధించింది. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ నుంచి ఆర్సీబీ జట్టు బెంగళూరుకు చేరుకోగా ఘనంగా స్వాగతం లభించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జట్టు సన్మాన కార్యక్రమం క్రమంలో  భారీ సంఖ్యలో అభిమానులు స్టేడియం దగ్గరకు వచ్చారు. గేటు దగ్గర పరిస్థితి అదుపుతప్పి తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది చనిపోగా, 50 మంది గాయపడ్డారు. 

కర్నాటక సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి

కర్నాటక సీఎం సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య మాట్లాడుతూ.. 'వేడుకల వేళ ఇలాంటి ఘటన చాలా బాధను కలిగిస్తోంది. ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఊహించని విధంగా జనం వచ్చారు. విధానసౌధ ఎదుట లక్ష మందికి పైగా జనం ఉన్నారు. అక్కడ ఎలాంటి ఘటన జరగలేదు. కానీ స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఎవరూ ఊహించలేదు. జిల్లా కలెక్టర్ ద్వారా విచారణ జరిపిస్తాం. నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం' అని చెప్పారు.

బెంగళూరు తొక్కిసలాట బాధిత కుటుంబాలకు సాయం 

బెంగళూరు తొక్కిసలాట ప్రమాదంలో 11 మంది చనిపోయారనీ, 47 మంది గాయపడ్డారని సీఎం తెలిపారు. వీరిలో 33 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి మృతుని కుటుంబానికి రూ. 10 లక్షల సాయం ప్రకటించారు. అలాగే, గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ దుర్ఘటనపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని తెలిపారు. 

 బెంగళూరు ఘటనపై సిద్ధరామయ్య ట్వీట్ 

బెంగళూరు ఘటనపై సోషల్ మీడియాలో సీఎం సంతాపం తెలిపారు. 'చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ గెలుపు వేడుకల్లో తొక్కిసలాట జరిగి చాలా మంది చనిపోయారు, కొంతమందికి గాయాలయ్యాయి. ఈ వార్త విని చాలా బాధపడ్డాను. ఈ విషాదం గెలుపు సంతోషాన్ని కూడా తుడిచిపెట్టేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి' అంటూ పేర్కొన్నారు. 

ఇలాంటి తొక్కిసలాట జరిగి, జనం గుమిగూడితే ఏదైనా అవాంఛనీయ ఘటన జరగవచ్చనే ఉద్దేశంతో జట్టు విజయయాత్రకు అనుమతి నిరాకరించి ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా స్టేడియం దగ్గర జనం కిక్కిరిసి ఉండటంతో తొక్కిసలాట జరిగింది. ప్రేమ, అభిమానం కంటే ప్రాణం ముఖ్యం అని గుర్తుంచుకుని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని ట్వీట్ చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే