బెంగుళూరు సౌత్ పార్లమెంట్ స్థానం: బీజేపీ టిక్కెట్టుకు కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్, తేజస్వి సూర్య మధ్య పోటీ?

By narsimha lode  |  First Published Jan 27, 2024, 12:36 PM IST

బెంగుళూరు  దక్షిణ పార్లమెంట్ స్థానం నుండి  కేంద్ర మంత్రి జైశంకర్ బరిలోకి దిగుతారనే ప్రచారం తెరమీదికి వచ్చింది. 



బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని  బెంగుళూరు సౌత్ లోక్ సభ నియోజకవర్గం నుండి  బీజేపీ అభ్యర్థులు  వరుసగా ఏడు దఫాలు విజయం సాధించారు.దక్షిణ బెంగుళూరు లోక్ సభ స్థానంలోని  ఎనిమిది  అసెంబ్లీ నియోజకవర్గాల్లో  ఐదు స్థానాల్లో  బీజేపీ అభ్యర్థులున్నారు. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులన్నారు. బెంగుళూరు సౌత్ పార్లమెంట్ నియోజకవర్గంలో  జేడీఎస్ ఉనికి లేదు. 

బెంగుళూరు దక్షిణ పార్లమెంట్ స్థానం నుండి ఆరు దఫాలు అనంతకుమార్  ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో  తేజస్వి సూర్య  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బీకే హరిప్రసాద్ పై 3.31 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Latest Videos

also read:అచ్చు సినిమానే: కవలలను విడదీసిన తండ్రి, 19 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెళ్లు

బీజేవైఎం అధ్యక్షుడిగా ఉన్న తేజస్వి సూర్య ప్రస్తుతం  బెంగుళూరు సౌత్ పార్లమెంట్ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బెంగుళూరు సౌత్ పార్లమెంట్ స్థానం నుండి కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ పోటీ చేస్తారనే  ప్రచారం కూడ తెరమీదికి వచ్చింది.   జైశంకర్ రాజ్యసభ సభ్యుడిగా  ఉన్నారు.  మోడీ కేబినెట్ లో  జైశంకర్ విదేశాంగ మంత్రిత్వశాఖను నిర్వహిస్తున్నారు. 

also read:జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?

బెంగుళూరు సౌత్ పార్లమెంట్ స్థానంలో  తేజస్వి సూర్య స్థానంలో  కేంద్ర మంత్రి జైశంకర్  పోటీ చేసే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  అయితే  ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. మరో వైపు సిట్టింగ్ ఎంపీ తేజస్వి సూర్య కూడ  బెంగుళూరు సౌత్  పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో కూడ పలువురు పోటీ చేస్తారనే ప్రచారం సాగుతుంది.  మాజీ ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి, మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్,  మాజీ మంత్రి ఆర్వీ దేశ్ పాండే సహా పలువురి పేర్లు  కాంగ్రెస్ పార్టీ  ప్రతిపాదనలో ఉన్నాయని  ప్రచారం సాగుతుంది.

also read:IND vs ENG 1st Test: ఉప్పల్ స్టేడియంలో రోహిత్ శర్మ పాదాలను తాకిన అభిమాని, వీడియో వైరల్

బెంగుళూరు సౌత్ పార్లమెంట్ నియోజకవర్గంలోని  జయనగర్ అసెంబ్లీ స్థానంలో  స్వల్ప ఓట్ల తేడాతో  సౌమ్యరెడ్డి ఓటమి చెందారు.ఈ నియోజకవర్గంలో బ్రహ్మణ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉంటారు. దీంతో  కాంగ్రెస్ పార్టీ రమేష్ కుమార్ పేరును కూడ పరిశీలిస్తుందనే  ప్రచారం కూడ లేకపోలేదు. 
 

click me!