బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్ లోటస్ 2.0 ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారు.
also read:జగన్ ఉత్తరాంధ్ర సెంటిమెంట్: 2019 రికార్డు పునరావృతం చేస్తారా?
తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్లను ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చలు జరుపుతుందని ఆయన ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేస్తామని కూడ కేజ్రీవాల్ ఎక్స్ లో పోస్టు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
पिछले दिनों इन्होंने हमारे दिल्ली के 7 MLAs को संपर्क कर कहा है - “कुछ दिन बाद केजरीवाल को गिरफ़्तार कर लेंगे। उसके बाद MLAs को तोड़ेंगे। 21 MLAs से बात हो गयी है। औरों से भी बात कर रहे हैं। उसके बाद दिल्ली में आम आदमी पार्टी की सरकार गिरा देंगे। आप भी आ जाओ। 25 करोड़ रुपये देंगे…
— Arvind Kejriwal (@ArvindKejriwal)తమ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ చర్చించినట్టుగా కేజ్రీవాల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ సర్కార్ ను కూల్చి వేస్తామని కూడ ఎమ్మెల్యేలకు బీజేపీ నేతలు చెప్పారని కేజ్రీవాల్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్టుపై పోటీ చేయాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ఆఫర్లు ఇచ్చిందని ఆయన ఆరోపించారు.
also read:అచ్చు సినిమానే: కవలలను విడదీసిన తండ్రి, 19 ఏళ్ల తర్వాత కలిసిన అక్కా చెల్లెళ్లు
ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను అరెస్ట్ చేయాలనే కుట్ర చేస్తున్నారనే అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజలు, దేవుడు తమకు మద్దతుగా నిలిచారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా ఉన్నారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. బీజేపీ చేయాలనుకున్న కుట్రలు కూడ విఫలమౌతాయని అరవింద్ కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్ కు నాలుగు దఫాలు ఈడీ అధికారులు సమన్లు పంపారు. నాలుగు దఫాలు ఈడీ విచారణకు అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదు.నాలుగు దఫాలు రకరకాల కారణాలతో కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కాలేదు.