హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి.. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఘటన

Published : Mar 07, 2023, 01:22 PM ISTUpdated : Mar 07, 2023, 01:23 PM IST
హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై దాడి.. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఘటన

సారాంశం

హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పాకిస్తాన్ పంజాబ్ యూనివర్సిటీలో చోటు చేసుకుంది. ఈ వేడుకలు జరుపుకునేందుకు అడ్మినిస్ట్రేషన్ నుంచి పర్మిషన్ తీసుకున్నా కూడా తమపై దాడి జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  

పాకిస్థాన్‌లో హోలీ జరుపుకున్నందుకు హిందూ విద్యార్థులపై దాడి జరిగింది. ఈ ఘటన లాహోర్‌లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకుంది. యూనివర్శిటీ ప్రాంగణంలో హోలీ జరుపుకుంటున్న హిందూ విద్యార్థులపై పెద్ద సంఖ్యలో వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పెళ్లైన 29యేళ్లకు కూతుళ్ల కోసం ఓ జంట మళ్లీ పెళ్లి.. ఆ తండ్రి నిర్షయానికి అందరూ ఫిదా.. ఎందుకంటే...

పంజాబ్ యూనివర్శిటీలోని లా కాలేజీలో దాదాపు 30 మంది హిందూ విద్యార్థులు హోలీ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో రాడికల్ ముస్లింలు వారిపై దాడికి పాల్పడ్డారు. కనికరం లేకుండా కొట్టారు. అంతే కాదు హోలీ సంబరాలు చేసుకుంటున్న విద్యార్థులను క్యాంపస్ నుంచి బయటకు తోసేశారు. ఈ దాడిలో 15 మందికి పైగా హిందూ విద్యార్థులు గాయపడ్డారు. హోలీ జరుపుకునేందుకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకున్నారని హిందూ విద్యార్థులు చెబుతున్నారు. అయినప్పటికీ వారిపై ఇలా దుండగులు దాడి చేశారు. బాధితులంతా ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు లాహోర్ పోలీసులను ఆశ్రయించారు.

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు... రబ్రీదేవి తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ ను ప్రశిస్తున్న సీబీఐ అధికారులు

ఈ ఘటనపై యూనివర్సిటీ విద్యార్థి, ప్రత్యక్ష సాక్షి కాషిఫ్ బ్రోహి మీడియాతో మాట్లాడుతూ..  “ఇస్లామిక్ జమియత్ తుల్బా (ఐజేటీ) కార్యకర్తలు హోలీ జరుపుకోకుండా హిందూ విద్యార్థులను బలవంతంగా అడ్డుకున్నారు. ఈ ఘర్షణలో 15 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ’’ అని అన్నారు. హోలీ జరుపుకునేందుకు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకున్నట్లు బ్రోహి పేర్కొన్నారు.

మరో విద్యార్థి ఖేత్ కుమార్‌ మాట్లాడుతూ.. ఐజేటీ దాడులకు వ్యతిరేకంగా తాము నిరసన తెలియజేస్తుంటే యూనివర్సిటీ గార్డులు కొట్టారని తెలిపారు. తమపై దాడికి పాల్పడిన వారిపై, అలాగే సెక్యూరిటీ గార్డులపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని చెప్పారు. 

మేఘాలయ సీఎంగా కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం.. హాజ‌రైన ప్ర‌ధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా

కాగా.. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఏ మతపరమైన మైనారిటీ కూడా స్వేచ్ఛగా జీవించడం లేదని భారత్ ఇటీవల పేర్కొంది. ‘‘ఈ రోజు పాకిస్తాన్‌లో ఏ మతపరమైన మైనారిటీలు కూడా స్వేచ్ఛగా జీవించలేరు. లేదా తమ మతాన్ని ఆచరించలేరు... ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది పౌరుల మరణానికి పాకిస్తాన్ విధానాలు ప్రత్యక్షంగా కారణమవుతున్నాయి’’ అని గత వారం యూఎన్ మానవ హక్కుల మండలిలో భారత ప్రతినిధి అన్నారు.గత దశాబ్దంలో బలవంతపు అదృశ్యాలపై పాకిస్థాన్ సొంత ప్యానెల్‌కు 8,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని ప్రతినిధి చెప్పారు.

ఇదిలా ఉండగా.. మైనారిటీ హిందూ సమాజానికి చెందిన దాదాపు 22,10,566 మంది పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. దేశంలోని మొత్తం జనాభా 18,68,90,601లో కేవలం 1.18 శాతం మాత్రమే హిందువులు ఉన్నారని సెంటర్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ పాకిస్తాన్ నివేదిక తెలిపింది. పాకిస్తాన్‌లో హిందూ జనాభాతో పాటు మైనారిటీలకు దేశంలోని శాసన వ్యవస్థలో చాలా తక్కువ ప్రాతినిధ్యం ఉంది. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్నారు. వీరంతా తరచుగా తీవ్రవాదుల వేధింపులకు గురవుతున్నట్టు ఫిర్యాదు చేస్తుంటారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !