పెళ్లైన 29యేళ్లకు కూతుళ్ల కోసం ఓ జంట మళ్లీ పెళ్లి.. ఆ తండ్రి నిర్షయానికి అందరూ ఫిదా.. ఎందుకంటే...

Published : Mar 07, 2023, 01:05 PM IST
పెళ్లైన 29యేళ్లకు కూతుళ్ల కోసం ఓ జంట మళ్లీ పెళ్లి.. ఆ తండ్రి నిర్షయానికి అందరూ ఫిదా.. ఎందుకంటే...

సారాంశం

ఓ తడ్రి తన కూతుర్ల ఆర్థిక భవిష్యత్తుకోసం మరోసారి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా ప్రత్యేక వివాహ చట్టం ద్వారా తన భార్యను పెళ్లాడనున్నాడు. 

కేరళ :  కొడుకు కోసమో, కూతురి కోసమో రెండో పెళ్లి చేసుకునే వారిని చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక జంట తమ కూతుర్ల కోసం.. వారే తిరిగి పెళ్లి చేసుకుంటున్నారు. ఒకసారి పెళ్లయిన జంట 60 ఏళ్ల తర్వాత షష్టిపూర్తి చేసుకోవడం ఆనవాయితీ. కానీ కేరళలోని ఓ జంట తమ కూతుర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం మరోసారి పెళ్లి చేసుకుంటున్నారు. మార్చి 8వ తారీఖున వీరి వివాహం జరగనుంది. ఈ విచిత్రమైన పెళ్లి కేరళలోని  కాసరగోడ్ జిల్లాలో జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సి షుకుర్ నటుడు, న్యాయవాది. ఆయన భార్యషీనా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మాజీ వైస్ ఛాన్స్ లర్. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. ఈ ముస్లిం జంట ప్రత్యేక వివాహ మార్గంలో మరోసారి ఒకటవ బోతున్నారు. దీని వెనక వారి కూతుర్లకు ఆర్థిక భవిష్యత్తును ఇవ్వడమే ఉద్దేశంగా చెబుతున్నారు. ముస్లిం వారసత్వ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తిలో కుమార్తెలకు మూడింట రెండొంతులు మాత్రమే వస్తుంది. . ఇక వారికి వారసుడు లేనట్లయితే ఆ ఆస్తి మొత్తం తండ్రి సోదరులకు చెందుతుంది.

ఆర్ఎస్ఎస్ ఒక సీక్రెట్ సొసైటీ.. ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోలిక.. లండన్‌లో రాహుల్ గాంధీ

దీనివల్ల తమ కూతుర్లకు అన్యాయం జరగకుండా ఉండాలని వీరు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం తమ పెళ్లిని నమోదు చేసుకోవాలనుకుంటున్నారు. దీని ద్వారా తమ కూతుర్లకు భవిష్యత్తులో ఎదురవబోయే పరిస్థితిని మార్చుకోవాలని ఆశిస్తున్నారు. గత వారంలో ఇలాంటి రెండు ఘటనలు చూసిన తర్వాత.. వారు తమ కూతుర్ల విషయంలో కూడా అలా జరగకూడదని ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిపారు. షరియా చట్టం ప్రకారం వీలునామాను అలా ఊరికే వదిలేయడానికి కూడా వీలుండదు. 

దీంతో ఆందోళన చెందిన తాము ఇలా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ జంట చెప్పుకొచ్చింది. తమ కుమార్తెలు ఆడపిల్లల అన్న కారణంగా ఇలాంటి వివక్ష ఎదుర్కోక తప్పడం లేదని.. దీని నుంచి వారిని బయటపడేయడానికి తాము ప్రత్యేక వివాహ చట్టం ద్వారా మరోసారి పెళ్లి చేసుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. తాము మరోసారి ప్రత్యేక  వివాహ చట్టం ద్వారా పెళ్లి చేసుకోవాలనుకోవడం ముస్లిం కుటుంబాలలోని ఆడపిల్ల  ఎదుర్కొనే లింగ వివక్షను అంతం చేయడానికేనని చెప్పుకొచ్చారు. 

అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో గౌరవంతో బతికేలా చేసేందుకు ఇది దోహదపడుతుందని నమ్మకంగా చెప్పారు అదే సమయంలో షరియా  చట్టాలను వ్యతిరేకించడం తమ అభిమతం కాదని.. దానికోసం తాము ఈ నిర్ణయానికి రాలేదని స్పష్టంగా తెలిపారు. ఆడపిల్లలు మాత్రమే ఉన్న చాలామంది తల్లిదండ్రులు తాము పడుతున్న కష్టాన్ని తన దగ్గర చెప్పుకునే వారిని షుకుర్ అన్నారు. 1994, అక్టోబర్ 6న వీరి వివాహం జరిగింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం మరోసారి వీరు ఈ ఏడాది మార్చి 8న.. తమ కూతుర్ల సమక్షంలో కాసర్ గోడ్ జిల్లా హోస్ దుర్గ్ తాలూకాలోని  కన్హంగాడులోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో.. తిరిగి వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా షుకూర్  తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !