ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బాలికను పొరుగింట్లో ఉండే యువకుడు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి అత్యారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు.
ప్రస్తుత్తం సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా యూపీకి చెందిన బాలికపై ఇలాంటి దారుణమే జరిగింది. ఆ మైనర్ ను ఓ యువకుడు కిడ్నాప్ చేసి హైదరాబాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు
‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ లోని బల్లియా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను కొన్ని రోజుల కిందట ఓ యవకుడు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్ కు తీసుకెళ్లి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
Rahul gandhi : బీజేపీ ఎక్కడ చెబితే అక్కడ మజ్లిస్ పోటీ చేస్తుంది - కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
నవంబర్ 25వ తేదీన బల్లియాలోని మణియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం నుంచి బాలికను రక్షించారు. అనంతరం నవంబర్ 27న స్థానిక బస్ స్టేషన్ లో 19 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ యువకుడు బాలిక పొరుగు ఇంట్లో ఉండేవాడని పోలీసులు తెలిపారు. అతడిని రిమాండ్ కు తరలించినట్టు వెల్లడించారు.
Nara Lokesh : జగన్ హయాంలో కరెంట్ బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతోంది - నారా లోకేష్
నవంబర్ 18న ఆమెను కిడ్నాప్ చేశారని, ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మణియార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) మంతోష్ సింగ్ తెలిపారు. బాలిక కూడా నిందితుడైన యువకుడు తనను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి దాదాపు వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ఎస్ హెచ్ వో తెలిపారు. బాలిక వాంగ్మూలం మేరకు ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం)తో పాటు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత నిబంధనలపై కేసు నమోదు చేశారు.