వాజ్‌పేయ్: బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర, మూడు దఫాలు ప్రధానిగా

By narsimha lodeFirst Published Aug 16, 2018, 5:48 PM IST
Highlights

మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ చిన్నతనం నుండి సమాజ సేవ పట్ల  ఆసక్తి ఉండేది.   సామాజిక కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొనేవారు. ఆర్యసమాజ్, ఆర్ఎస్ఎస్‌లలో  ఆయన చురుకుగా పాల్గొనేవాడు. ఆ తర్వాత జనసంఘ్, బీజేపీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 
 

న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయ్ చిన్నతనం నుండి సమాజ సేవ పట్ల  ఆసక్తి ఉండేది.   సామాజిక కార్యక్రమాల్లో ఆయన విస్తృతంగా పాల్గొనేవారు. ఆర్యసమాజ్, ఆర్ఎస్ఎస్‌లలో  ఆయన చురుకుగా పాల్గొనేవాడు. ఆ తర్వాత జనసంఘ్, బీజేపీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. 

1924 డిసెంబర్ 25 వ తేదీన  కృష్ణాదేవీ, కృష్ణాబాయి వాజ్‌పేయ్ దంపతులకు వాజ్ పేయ్ గ్వాలియర్‌లో జన్మించాడు.  వాజ్‌పేయ్ తాత పండిట్ శ్యామ్ లాల్ వాజ్‌పేయ్ యూపీ నుండి వలస వచ్చినట్టుగా చెబుతారు.

వాజ్‌పేయ్ తండ్రి కృష్ణాబాయి వాజ్ పేయ్   స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. వాజ్‌పేయ్  శిశు మందిర్‌లో  విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. గ్వాలియర్ లోని విక్టోరియా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. కాన్పూర్ లో  ఎంఏ పూర్తి చేశారు.  చదువుకొనే రోజుల్లోనే సమాజసేవ పట్ల  వాజ్‌పేయ్ ఆకర్షితులయ్యారు. ఆర్యసమాజ్‌కు అనుబంధంగా ఉన్న ఆర్య కుమార్  సభలో వాజ్‌పేయ్  చురుకుగా పాల్గొనేవాడు. 

1939లో ఆర్ఎస్ఎస్ లో వాజ్‌పేయ్ చేరారు.  ఆ తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్‌లో చురుకుగా పాల్గొనేవాడు.  1940 నుండి 1944 మధ్యలో  ఆర్ఎస్ఎస్  నిర్వహించిన ఆఫీసర్స్ క్యాంపులో వాజ్‌పేయ్ పాల్గొన్నారు.  ఆ తర్వాత 1947 లో ఆర్ఎస్ఎస్ పుల్ టైమర్‌గా వాజ్‌పేయ్ చేరారు.

1942లో వాజ్‌పేయ్  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.  వాజ్‌పేయ్ సోదరుడు  క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా అరెస్టై జైలు జీవితాన్ని గడిపాడు. అప్పటి నుండి వాజ్‌పేయ్ రాజకీయాలతో సంబంధాలను కొనసాగించారు.  

1948లో ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించారు. దీంతో  పండిట్ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయతో కలిసి ఆయన జనసంఘ్‌ను ఏర్పాటు చేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి సన్నిహితుడుగా మారారు. 1968లో జనసంఘ్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జనసంఘ్ క్రమంగా బలహీన పడడంతో బీజేపీ నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

1957లో భారతీయ జనసంఘ్ అభ్యర్థిగా బలరాంపూర్ స్థానం నుండి పోటీ చేశారు. ఆ సమయంలో ఆయన ఈ స్థానం నుండి విజయం సాధించారు. నాలుగురాష్ట్రాల్లోని ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన రికార్డు వాజ్ పేయ్ పేరున ఉంది. పార్లమెంట్ సభ్యుడిగా ఆయన 10 దఫాలు ఎన్నికయ్యారు. 

మరో వైపున వాజ్‌పేయ్ మాధవరావు సింథియా 1984 లో ఒడించాడు. గ్వాలియర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన వాజ్‌పేయ్ ను మాధవరావు సింథియా ఓడించాడు.

ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1977లో ఎమర్జెన్సీని విధించారు.ఆ సమయంలో వాజ్‌పేయ్ సహ పలువురు విపక్ష పార్టీల నేతలను ఇందిరా గాంధీ అరెస్ట్ చేయించారు.  
 

click me!