ఏషియానెట్ న్యూస్ సర్వే: యూపీలో విజేతను నిర్ణయించేది కుల సమీకరణలే....

By team teluguFirst Published Aug 18, 2021, 6:15 PM IST
Highlights

మరో 7 నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి కుల సమీకరణాలు కీలకం కానున్నాయి. యాదవ, యాదవేతర,జాట్, బ్రాహ్మణులూ ఎటువైపు తమ మద్దతు ప్రకటిస్తున్నారో ఏషియానెట్ న్యూస్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే లో తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కుల రాజకీయాలు అత్యంత కీలకం అన్నది జగమెరిగిన సత్యం. మరో 7 నెలల్లో రానున్న ఈ దఫా ఎన్నికల్లో కూడా అదే తరహా ట్రెండ్ మనకు కనబడనున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. 

ఉత్తరప్రదేశ్ ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు జన్ కి బాత్ సంస్థతో చేపించిన సర్వేలో 70 శాతం బ్రాహ్మణులూ బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు అర్థమవుతుంది. కేవలం 20 శాతం మంది మాత్రమే సమాజ్ వాది పార్టీ వైపు మొగ్గు చూపగా... 10 శాతం మంది బీఎస్పీ కి ఓటేస్తామని చెప్పారు. మరో 5 శాతం మంది తాము కాంగ్రెస్ పార్టీకి తాము ఓటేయాలనుకుంటున్నట్టు తెలిపారు. 

"

జాట్ ఓటర్లలో 60 శాతం మంది సమాజ్ వాది పార్టీ వైపు మొగ్గు చూపుతుండగా కేవలం 30 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటేస్తామని తెలిపారు. ఇక యాదవుల విషయానికి వస్తే కేవలం 10 శాతం మంది యాదవ్ లు మాత్రమే బీజేపీకి మద్దతిస్తుండగా... 90 శాతం మంది సమాజ్ వాడి పార్టీకే తాము ఓటేయబోతున్నట్టు తెలిపారు. 

ఇక ఓబీసీల్లో యాదవేతరులు 90 శాతం మంది బీజేపీ వైపు మొగ్గు చూపగా కేవలం 10 శాతం మంది మాత్రమే సమాజ్ వాది పార్టీకి ఓటేస్తామని తెలిపారు. 

Also Read: రానున్న యూపీ ఎన్నికల్లో రామమందిరం ప్రభావం చూపుతుందా..?

ఇక ఉత్తరప్రదేశ్ లోని ప్రాంతాలవారీగా గనుక చూసుకుంటే... గోరఖ్ ప్రాంతంలో 90 శాతం మంది బ్రాహ్మణులూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా... 5 శాతం మంది బీఎస్పీ కి మద్దతు పలుకుతుండగా కేవలం 3 శాతం మంది మాత్రమే సమాజ్ వాది పార్టీకి మద్దతు ప్రకటించారు. 

బ్రిజ్ ప్రాంతంలో...  56 శాతం మంది బ్రాహ్మణులూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా... 7 శాతం మంది బీఎస్పీ కి మద్దతు పలుకుతుండగా 14 శాతం మంది మాత్రమే సమాజ్ వాది పార్టీకి మద్దతు ప్రకటించారు. 

పశ్చిమ ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే... 65 శాతం మంది బ్రాహ్మణులూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా... 5 శాతం మంది బీఎస్పీ కి మద్దతు పలుకుతుండగా 28 శాతం మంది సమాజ్ వాది పార్టీకి మద్దతు ప్రకటించారు. 

అవధ్ ప్రాంతంలో... 80 శాతం మంది బ్రాహ్మణులూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా... 3 శాతం మంది బీఎస్పీ కి మద్దతు పలుకుతుండగా 15 శాతం మంది సమాజ్ వాది పార్టీకి మద్దతు ప్రకటించారు. 

కాశీ ఏరియాలో... 68 శాతం మంది బ్రాహ్మణులూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా... 5 శాతం మంది బీఎస్పీ కి మద్దతు పలుకుతుండగా 25 శాతం మంది సమాజ్ వాది పార్టీకి మద్దతు ప్రకటించారు. 

ఇక మరో ప్రాంతం కాన్పూర్ బుందేల్ ఖండ్ రీజియన్ లో... 34 శాతం మంది బ్రాహ్మణులూ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండగా...18 శాతం మంది బీఎస్పీ కి మద్దతు పలుకుతుండగా 12 శాతం మంది సమాజ్ వాది పార్టీకి మద్దతు ప్రకటించారు. మరో 36 శాతం మంది ఎవరికీ మద్దతివ్వాలో తేల్చుకోలేదని చెప్పడం గమనార్హం. 

ఇక ఓబీసీల్లో యాదవ, యాదవేతరుల విషయానికి వస్తే... ప్రాంతాల వారీగా ఇలా ఉంది. గోరఖ్ ప్రాంతంలో 70 శాతం యాదవ్ ఓట్లు సమాజ్ వాదీ పార్టీ వైపు ఉండగా... 30 శాతం బీజేపీ వైపు చూస్తున్నారు. యాదవేతరుల విషయానికి వస్తే... 70 శాతం బీజేపీతో ఉండగా, 25 శాతం మంది అఖిలేష్ కి మద్దతు తెలిపారు. 

బ్రిజ్ ప్రాంతంలో... 80 శాతం యాదవ్ ఓట్లు సమాజ్ వాదీ పార్టీ వైపు ఉండగా... 10 శాతం బీజేపీ వైపు చూస్తున్నారు. యాదవేతరుల విషయానికి వస్తే... 58 శాతం బీజేపీతో ఉండగా, 20 శాతం మంది అఖిలేష్ కి మద్దతు తెలిపారు. 

పశ్చిమ యూపీలో...  78 శాతం యాదవ్ ఓట్లు సమాజ్ వాదీ పార్టీ వైపు ఉండగా... 6 శాతం బీజేపీ వైపు చూస్తున్నారు. యాదవేతరుల విషయానికి వస్తే... 58 శాతం బీజేపీతో ఉండగా, 22 శాతం మంది అఖిలేష్ కి మద్దతు తెలిపారు. 

అవధ్ ప్రాంతంలో... 95 శాతం యాదవ్ ఓట్లు సమాజ్ వాదీ పార్టీ వైపు ఉండగా... 5 శాతం బీజేపీ వైపు చూస్తున్నారు. యాదవేతరుల విషయానికి వస్తే... 60 శాతం బీజేపీతో ఉండగా, 20 శాతం మంది అఖిలేష్ కి మద్దతు తెలిపారు. 

Also Read: ఏషియానెట్ న్యూస్ సర్వే: తదుపరి ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు?

కాశీ విషయానికి వస్తే... 84 శాతం యాదవ్ ఓట్లు సమాజ్ వాదీ పార్టీ వైపు ఉండగా... 12 శాతం బీజేపీ వైపు చూస్తున్నారు. యాదవేతరుల విషయానికి వస్తే... 46 శాతం బీజేపీతో ఉండగా, 32 శాతం మంది అఖిలేష్ కి మద్దతు తెలిపారు. 

ఇక కాన్పూర్ బుందేల్ ఖండ్ ప్రాంతంలో... 70 శాతం యాదవ్ ఓట్లు సమాజ్ వాదీ పార్టీ వైపు ఉండగా... 18 శాతం బీజేపీ వైపు చూస్తున్నారు. యాదవేతరుల విషయానికి వస్తే... 64 శాతం బీజేపీతో ఉండగా, 27 శాతం మంది అఖిలేష్ కి మద్దతు తెలిపారు. 

ఉత్తరప్రదేశ్ లోని 6 భౌగోళిక ముఖ్య ప్రాంతాలైన కాన్పూర్ బుందేల్ ఖండ్, అవధ్, పశ్చిమ యూపీ, కాశి, బ్రిజ్, గోరఖ్ ప్రాంతాల్లో 4200 మంది ఓటర్లను శాంపిల్ తో ఈ ఒపీనియన్ సర్వేని నిర్వహించడం జరిగింది. రాండమ్ శాంప్లింగ్ ద్వారా వన్ ఆన్ వన్ ఇంట్రాక్షన్స్ తో ప్రాబబిలిటీ మ్యాపింగ్ ద్వారా ఈ సర్వే చేయడం జరిగింది.

click me!