అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

By narsimha lodeFirst Published Aug 24, 2019, 1:24 PM IST
Highlights

విద్యార్ధి సంఘం నేత నుండి అరుణ్ జైట్లీ  కేంద్ర మంత్రి స్థాయికి ఆయన ఎదిగారు. అరుణ్ జైట్లీ అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు.

న్యూఢిల్లీ: విద్యార్ధి దశలో ఏబీవీపీలో కీలక నేతగా పనిచేసిన అరుణ్ జైట్లీ కేంద్రమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీలో విద్యార్ధులను కూడగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధి సంఘం నేతగా అరుణ్ జైట్లీ పనిచేశారు.

న్యూఢిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డీగ్రీ పట్టాను తీసుకొన్నారు. 1977లో ఢిల్లీ యూనివర్శిటీ నుండి లా పట్టా పొందారు.

ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకొనే సమయంలో ఆయన ఏబీవీపీలో కీలక నేతగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్శిటీకి అధ్యక్షుడిగా పనిచేశారు. 1974లోనే ఆయన ఢిల్లీ యూనివర్శిటీకి అధ్యక్షుడిగా ఆయన కొనసాగారు. 1977లో  ఎమర్జెన్సీని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

అవినీతికి వ్యతిరేకంగా రాజ్ నారాయణ్,జయప్రకాష్ నారాయణ చేపట్టిన ఉద్యమంలో జైట్లీ పనిచేశారు.1977 లో లోక్ తాంత్రిక్ యువ మోర్చా అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీని జయప్రకాష్ నారాయణ నియమించారు. 

ఎమర్జెన్సీ కాలంలో 19 నెలలపాటు జైట్లీ జైలులో ఉన్నారు. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత జనసంఘ్ లో చేరారు. 1987 నుండి పలు రాష్ట్రాల హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. 1990 లో ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గా నియమితులయ్యారు.

1991 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అరుణ్ జైట్లీ ఉన్నాడు. 1999 బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు. 1999లో వాజ్‌పేయ్ ప్రభుత్వంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా జైట్లీ పనిచేశారు. 

2000 లో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.2002లో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.2003లో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో బీజేపీ ఓటమి పాలైంది.

2004-2009 వరకు రాజ్యసభలో బీజేపీ పక్షనేతగా ఆయన పనిచేశారు.2014లో అమృత్ సర్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ప్రస్తుత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 2019లో ఆయన పోటీకి దూరంగా ఉన్నాడు.

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

click me!