అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

Published : Aug 24, 2019, 01:04 PM ISTUpdated : Aug 24, 2019, 01:05 PM IST
అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

సారాంశం

 గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా... ఆయన మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ శనివారం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు.

ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. అరుణ్ జైట్లీ మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. జైట్లీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జైట్లీ మరణ వార్తపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించారు. జైట్లీ మరణ వార్త విని ఎంతో బాధ కలిగిందని జగన్ పేర్కొన్నారు. 40 సంవత్సరాలపాటు జైట్లీ తన జీవితాన్ని రాజకీయాల్లోనే గడిపారని జగన్ పేర్కొన్నారు. ఈ కాలంలో ఆయన దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేసుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని.. తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం