ఆర్మీ అధికారులు వివాహేతర సంబంధం పెట్టుకుంటే యాక్షన్ తీసుకోవచ్చా?.. సుప్రీంకోర్టు తీర్పు ఇదే

By Mahesh KFirst Published Jan 31, 2023, 6:59 PM IST
Highlights

సుప్రీంకోర్టు 2018లో వివాహేతర సంబంధం నేరం కాదని ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ఆర్మ్‌డ్ ఫోర్సెస్ యాక్ట్‌కు సంబంధించిన ఓ అంశంపై పిటిషన్ వేసింది. వివాహేతర సంబంధం పెట్టుకునే ఆర్మీ అధికారులపై యాక్షన్ తీసుకోవచ్చునా? ని అడిగింది. దీనికి 2018లో వెలువరించిన తీర్పు ఐపీసీ, సీఆర్‌పీసీలోని సెక్షన్‌లకు మాత్రమే వర్తిస్తుందని, కానీ, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ యాక్ట్‌కు వర్తించదని, కాబట్టి, వివాహేతర సంబంధం కేసుల్లో ఆర్మీ ఆఫీసర్లను విచారించవచ్చునని తెలిపింది.
 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 2018లో వివాహేతర సంబంధం నేరం కాదని చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సెక్షన్ 497‌ను కొట్టేసింది. అయితే, ఈ తీర్పు సాయుధ దళాల చట్టంపై ప్రభావం వేయదని తాజాగా సుప్రీంకోర్టు పేర్కొంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై మార్షల్ కోర్టు చేసే విచారణపై 2018లో ఇచ్చిన తీర్పు ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. కాబట్టి, వివాహేతర సంబంధం పెట్టుకున్న ఆర్మీ అధికారులపై ఆర్మ్‌డ్ ఫోర్సెస్ యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవచ్చని వివరించింది.

వివాహేతర సంబంధం నేరం కాదని పేర్కొనే తీర్పు ఆర్మ్‌డ్ ఫోర్సెస్ యాక్ట్ నిబంధనలు ప్రభావితం చేయదని జస్టిస్ కేఎం జోసెఫ్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్మీ యాక్ట్ కింద వివాహే తర సంబంధాలకు సంబంధించిన కేసులను విచారించవచ్చునా? లేక 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పరిధిలోనే విచారణ చేపట్టాలా? అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Also Read: యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూడటం వల్లే ఎగ్జామ్ ఫెయిలయ్యా.. పరిహారం కోసం కోర్టుకు వెళ్తే.. దిమ్మతిరిగే షాక్ ..

‘ఈ కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం ఐపీసీలోని సెక్షన్ 497, సీఆర్‌పీసీలోని సెక్షణ్ 198 (2)లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ యాక్ట్‌లోని నిబంధనలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ యాక్ట్‌లోని ప్రావిజన్స్‌‌తో ఆ తీర్పుకు ఎంతమాత్రం సంబంధం లేదని స్పష్టం చేసింది.

click me!