ఆర్యన్ ఖాన్‌కు అనన్య పాండే గంజాయి అందించిందా? ఎన్‌సీబీకి ఆమె ఏం చెప్పింది?

By telugu teamFirst Published Oct 22, 2021, 12:38 PM IST
Highlights

షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, చంకీ పాండే తనయ అనన్య పాండే మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను ఎన్‌సీబీ అధికారులు రికవరీ చేసుకున్నట్టు తెలిసింది. ఈ చాట్‌లో డ్రగ్స్ గురించి ప్రస్తావన వచ్చిందని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. గంజాయి సమకూర్చాల్సిందిగా ఆర్యన్ ఖాన్.. అనన్య పాండేను అడిగారని, అందుకు సరేనని అనన్య పాండే సమాధానమిచ్చినట్టు వాట్సాప్ చాట్‌లో తేలినట్టు సమాచారం. దీనిపైనే ఎన్‌సీబీ అధికారులు అనన్య పాండేను ప్రశ్నించారు.
 

ముంబయి: బాలీవుడ్ బాద్‌షా Shah Rukh Khan తనయుడు Aryan Khanపై నమోదైన Drugs కేసులో Bollywood యాక్టర్ చంకీ పాండే తనయ, నటి Ananya Pandayను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గురువారం ప్రశ్నించారు. ఆర్యన్ ఖాన్‌తో అనన్య పాండే Whatsapp Chat ఆధారంగా NCB అధికారులు ఆమెపై ప్రశ్నలు కురిపించారు. ఈ చాట్ ఆధారంగానే ఆమెను ప్రశ్నించడానికి సమన్లు జారీ చేశారు. గురువారం సుమారు రెండు గంటలపాటు ఆమెను ప్రశ్నించారు. మళ్లీ ఈ రోజు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిన్నటి దర్యాప్తులో కొన్ని కీలక ప్రశ్నలు బయటకు వచ్చాయి.

ఆర్యన్ ఖాన్, అనన్య పాండే ఇరువురి మధ్య గంజాయి గురించి జరిగిన వాట్సాప్ చాట్‌ను ఎన్‌సీబీ అధికారులు రికవరీ చేసుకున్నట్టు తెలిసింది. ఈ చాట్‌లో ఒక దశలో ఆర్యన్ ఖాన్ గంజాయి కోసం అనన్య పాండేను అడిగినట్టు ఎన్‌సీబీ అధికారవర్గాలు తెలిపాయి. తనకు గంజాయి సమకూర్చగలరా? అని అనన్య పాండేను ఆర్యన్ ఖాన్ అడిగినట్టు వివరించాయి. అందుకు అనన్య పాజిటివ్ రిప్లే ఇచ్చినట్టు తెలిపాయి. తాను అరేంజ్ చేస్తానని చెప్పినట్టు ఆ చాట్‌లో వెల్లడైనట్టు చెప్పాయి.

Also Read: కొడుకు ఆర్యన్ ఖాన్ కోసం జైలుకి వచ్చిన షారుక్!

ఈ చాట్‌పై ఎన్‌సీబీ అధికారులు గురువారం అనన్య పాండేను అడిగారు. అయితే, అనన్య పాండే మాత్రం తన సమాధానం ఉద్దేశం అది కాదని వివరించారు. తాను అప్పుడు జోక్ చేస్తున్నట్టు వివరించారు.

గంజాయి గురించిన వాట్సాప్ చాట్ రికవరీ చేసిన తర్వాత ఎన్‌సీబీ అధికారులు గురువారం ఉదయం ముంబయిలోని అనన్య పాండే, చంకీ పాండే నివాసానికి వెళ్లారు. దర్యాప్తునకు రావాల్సిందిగా సమన్లు ఇచ్చారు. దీంతో అనన్య పాండే తండ్రి చంకీ పాండేతో కలిసి ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న సాయంత్రం రెండు గంటలపాటు అనన్య పాండేను ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించారు. అనంతరం శుక్రవారం ఉదయం 11 గంటలకు మళ్లీ దర్యాప్తునకు రావాలని ఆదేశించారు.

ఆర్యన్ ఖాన్‌కు అనన్య పాండే డ్రగ్స్ సమకూర్చినట్టు ఇప్పటికైతే ఎలాంటి ఆధారాలు లభించలేవని ఎన్‌సీబీ వర్గాలు వివరించాయి. అయితే, డ్రగ్స్ గురించి ఆర్యన్ ఖాన్, అనన్య పాండే మధ్య పలుసార్లు చర్చ జరిగినట్టు వాట్సాప్ చాట్‌లో తేలిందని పేర్కొన్నాయి. గురువారం తొలిరౌండ్ ప్రశ్నల్లోనే అనన్య పాండే చాలా నెర్వస్ అయినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. తన తండ్రి చంకీ పాండే ఎదుటే ఒక్కసారిగా బోరుమని ఏడ్చేసినట్టు వివరించాయి. తర్వాత ఇంటరాగేషన్ రూమ్‌లోకి ఒంటరిగానే వెళ్లారు.

Also Read: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. రియా చక్రవర్తి పరోక్ష వ్యాఖ్యలు, గత ఏడాది ఆమె కూడా..

ఆర్యన్ ఖాన్‌ బెయిల్‌ను ముంబయి సెషన్స్ కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 30వ తేదీ వరకు ఆయన ఆర్థర్ రోడ్ జైలులోనే ఉండనున్నారు. ఈ బెయిల్ తిరస్కరించడంతో ఆర్యన్ ఖాన్ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది. బెయిల్ తిరస్కరణకు గురైన తర్వాత షారూఖ్ ఖాన్ తన తనయుడు ఆర్యన్ ఖాన్‌ను జైలుకు వెళ్లి కలిసి వచ్చారు. అనంతరం ఎన్‌సీబీ అధికారులు షారూఖ్ ఖాన్ నివాసానికి వెళ్లారు. తొలుత దీన్ని తనిఖీలుగా భావించారు. కానీ, ఆ వాదనలను అధికారులు కొట్టిపారేశారు. తాము కేవలం పేపర్ వర్క్ కోసం మాత్రమే షారూఖ్ ఖాన్ నివాసానికి వెళ్లినట్టు వివరించారు.

click me!